ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ కు ఎన్ని ఆస్తులున్నాయి?

Wakf Bill: ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ కు ఎన్ని ఆస్తులున్నాయి?

కొత్త బిల్లులోని నిబంధన ప్రకారం, వరుసగా ఐదేళ్లు ఇస్లాంను ఆచరించి, ఆస్తిపై యాజమాన్య హక్కుల కలిగిన వ్యక్తి మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్ఫ్ కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు బదిలీ అయింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదంలో కలెక్టర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ”ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మారవచ్చు” అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టుచేశారు. ”ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. మైనారిటీలను భయపెట్టి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే” అని అమిత్‌షా అన్నారు.

Advertisements
ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ కు ఎన్ని ఆస్తులున్నాయి?

వక్ఫ్‌కు ఎంత భూమి ఉంది?
ప్రభుత్వ డేటా ప్రకారం, వక్ఫ్‌కు దాదాపు 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వేల తర్వాత భారత్‌లో ఎక్కువభూములుంది వక్ఫ్‌కే. రక్షణ మంత్రిత్వ శాఖకు 17 లక్షల95వేల ఎకరాల భూమి ఉండగా, రైల్వే దగ్గర దాదాపు 12 లక్షల ఎకరాల భూమి ఉంది.

ఎన్ని ఆస్తులున్నాయి?
వంసి పోర్టల్ ప్రకారం, వక్ఫ్‌కు 8,72,324 స్థిరాస్తులు, 16,713 చరాస్తులను గుర్తించారు. వీటిలో 97 శాతం ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంసి పోర్టల్ ప్రకారం, 58,890 ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. 4,36,179 ఆస్తుల గురించి సైట్‌లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఫిబ్రవరి 9, 2022 నాటి మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటాప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 2,15,000 వక్ఫ్ ఆస్తులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 80,480, ఆంధ్రప్రదేశ్‌లో 10,708, గుజరాత్‌లో 30,881 ఆస్తులు ఉన్నాయి.

Related Posts
Israel-Hamas : ఇజ్రాయెల్‌ భీకర దాడి.. గాజాలో 32 మంది మృతి!
Fierce Israeli attack.. 32 people killed in Gaza!

Israel-Hamas : ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ వరుసదాడులతో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌పై టెల్‌అవీవ్‌ Read more

ఢిల్లీ ఎన్నికల్లో మధ్య తరగతి హవా!
elections

ఓవైపు చలి వణికిస్తున్నా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రాజకీయం వేడిని రాజేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరిన తరుణంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోననే Read more

చంద్రబాబు సమక్షంలో మంత్రి భరత్ సంచలన వ్యాఖ్యలు
Minister Bharat sensational comments in the presence of Chandrababu

జ్యూరిచ్: జ్యూరిచ్‌లో పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి భరత్ మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేశ్‌ సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వేదికపై సీఎం చంద్రబాబు కూడా Read more

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప -2 ట్రైలర్
pushpa 2 trailer views

పుష్ప 2 ట్రైలర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుంటే..సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తుందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ – Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×