గవర్నర్‌కు వీటో అధికారాల్లేవ్: సుప్రీంకోర్టు

Supreme Court: జడ్జీల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో కరెన్సీ కట్టలు బయటపడిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తుల తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని, కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని పొందుపరచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1న జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో చీఫ్ జస్టిస్ చేసిన ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తికి తమ ఆస్తుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

Advertisements
Yజడ్జీల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ బదిలీ
జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం గతవారం ఆమోదం తెలిపింది. జస్టిస్‌ వర్మ అధికారిక బంగ్లాలో మార్చి 14న హోలీ రోజు అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. అక్కడ స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్లకట్టలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. దీనిపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ ఇచ్చిన నివేదికను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన సుప్రీంకోర్టు.. జస్టిస్ వర్మ నివాసంలోని కాలిన నోట్ల కట్టల వీడియోలు, ఫోటోలు కూడా అందులో పెట్టింది.
త్రిసభ్య కమిటీ అంతర్గత విచారణ
ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కొలీజియం నియమించిన త్రిసభ్య కమిటీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. :కాగా, న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోన్న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా…. కొలీజియంలోని న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం జస్టిస్ వర్మ వివాదంపై ఢిల్లీ హైకోర్టు సీజే అందించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు విశ్వనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Related Posts
నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!
manmohan singh bharatartna

భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక రూపం ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతి Read more

విలువైన ఓటును ఉపయోగించుకోండి: మోడీ, అమిత్ షా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిసింది. ఢిల్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, Read more

భూమిని చేరుతున్న 5 గ్రహశకలాల ముప్పు?
భూమిని చేరుతున్న 5 గ్రహశకలాల ముప్పు?

నాసా ప్రకారం, ఈ రోజు ఐదు గ్రహశకలాలు భూమి వైపు ప్రయాణిస్తూ భయంకరమైన సమీపానికి చేరుకోనున్నాయి. ఇవి భూమికి ప్రమాదమా? ఈ అంశంపై నాసా అందించిన నివేదిక. Read more

Chhattisgarh : ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టుల మృతి!
Another shooting in Chhattisgarh leaves several dead

Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×