Nani: ది ప్యార‌డైజ్ ప్రాజెక్ట్ పై వస్తున్న అనుమానాలకు నాని వివరణ

Nani: ది ప్యార‌డైజ్ ప్రాజెక్ట్ పై వస్తున్న అనుమానాలకు నాని వివరణ

టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈమూవీతోపాటు మరోవైపు ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. దసరా సినిమాతో నాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో నాని ఊహించని లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisements

మూవీ టీమ్

మూవీ స్క్రిప్ట్ ప‌ట్ల నాని అసంతృప్తిగా ఉన్నార‌ని, బ‌డ్జెట్ కూడా ఎక్కువ కావ‌డంతో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై మూవీ టీమ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పుకార్లు సృష్టించేవారిని జోక‌ర్ల‌తో పోలుస్తూ ట్వీట్ చేసింది.’ది ప్యార‌డైజ్’ ప‌నులు అనుకున్న విధంగానే జ‌రుగుతున్నాయి.ఈ ప్రాజెక్ట్‌ సరైన మార్గంలోనే ఉంది. నిశ్చింతగా ఉండండి. దీన్ని ఎంత గొప్ప‌గా తీర్చిదిద్దుతున్నారో మీరు త్వ‌ర‌లోనే చూస్తారు. ఈలోగా మీకు వీలైనంత ఎక్కువ రూమ‌ర్స్ క్రియేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ‘గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి.మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ‌ను గ‌మ‌నిస్తున్నాం.అలాగే నిరాధార‌మైన వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వారిని గ‌మ‌నిస్తున్నాం. వాట‌న్నిటితో ఒక శ‌క్తిగా ఎదుగుతాం.టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ది ప్యార‌డైజ్ గ‌ర్వించే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేవారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ అంతా గ‌ర్వ‌ప‌డే సినిమాతో నాని మీ ముందుకు వ‌స్తార‌ని వాగ్దానం చేస్తున్నాం” అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది.  


పోస్టర్‌లో తుపాకీని పట్టుకుని ఉన్న నానిని చూసి ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు. చిత్రం ఫ్యాన్స్‌కి కనుల పండుగ‌గా ఉంటుంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.ది ప్యారడైజ్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 26న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుందని టాక్. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానుంది. సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Related Posts
ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
alia bhatt

సెలబ్రిటీల జీవితాలంటే లగ్జరీ కార్లు, ఖరీదైన బట్టలు,భోగభాగ్యాలు అనుకుంటారు.అయితే కొందరు తారలు ఆడంబరాలను పక్కన పెట్టి సాదాసీదా జీవితాన్ని చూపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు.ఇటీవలి కాలంలో బాలీవుడ్ అందాల Read more

Sreeleela: టాప్ హీరోయిన్లకి తప్పని ప్లాప్ అదేబాటలో శ్రీలీల కూడా ఉందా?
Sreeleela: టాప్ హీరోయిన్లకి తప్పని ప్లాప్ అదేబాటలో శ్రీలీల కూడా ఉందా?

స్టార్‌ డమ్ తక్కువ కాలం ఇటీవల హీరోయిన్స్‌కి లక్ ఎక్కువ రోజులు ఉండడం లేదు. ఒకప్పుడు వరుస హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్‌ ఇప్పుడు Read more

తాతగారి విగ్రహం ముందు మా పెళ్లి.. శోభిత నాగచైతన్య?
naga chaitanya sobhita

నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల పెళ్లి విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకుంది. ప్రస్తుతం వారి వివాహానికి Read more

Ananya Nagalla: హీరోయిన్‌లు కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక పారితోషికం, లేకపోతే మరో పారితోషికం ఉంటుందా?అనన్య నాగళ్లకు జర్నలిస్ట్‌ ప్రశ్న
ananya nagalla

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర సినీ రంగాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్‌ అనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది క్యాస్టింగ్ కౌచ్‌ గురించి పలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×