Aishwarya Rai Bachchan:స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐష్-అభి

Aishwarya Rai Bachchan:స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐష్-అభి

బాలీవుడ్‌ ప్రముఖ జంట ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని నెలలుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, వీరు త్వరలో విడిపోతారని పలు బాలీవుడ్‌ మీడియా సంస్థలు వార్తలు రాశాయి.తాజాగా, ఐశ్వర్య రాయ్‌ తన కుటుంబంతో కలిసి ఓ కుటుంబ వేడుకకు హాజరై, స్టేజ్‌పై అభిషేక్‌తో కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

పూణెలో వెడ్డింగ్‌

పూణెలో ఐశ్వర్య రాయ్‌ కజిన్‌ శ్లోకా శెట్టి సోదరుడి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఐశ్వర్యరాయ్‌ తన కూతురు ఆరాధ్య, భర్త అభిషేక్‌ బచ్చన్‌ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ‘బంటీ ఔర్ బబ్లి’ చిత్రంలోని కజ్రారే పాటను ఎంజాయ్‌ చేస్తూ కాలు కదిపారు.ఇద్దరూ కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేయడం చూసిన అక్కడున్నవారందరు హర్షం వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌

ఐశ్వర్య-అభిషేక్‌ల మధ్య విబేధాలు పెరిగి, విడాకుల దిశగా సాగుతున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వేడుకల్లో ఇద్దరూ కలిసి ఆనందంగా కనిపించడం, స్టేజ్‌పై డ్యాన్స్‌ చేయడం ఈ పుకార్లకు చెక్ పెట్టిందని అభిమానులు భావిస్తున్నారు.అయితే, ఈ జంట ఇప్పటి వరకు రూమర్స్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

హాట్ టాపిక్‌

వీరి విడాకుల పుకార్లు నిజమా? కేవలం గాసిప్స్ మాత్రమేనా? అన్నదానిపై క్లారిటీ రాలేదు. కానీ, ఈ ఫ్యామిలీ వేడుకల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో పాటు స్టేజ్‌పై డ్యాన్స్‌ చేయడం ఫ్యాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్‌గా మారింది.ఈ వీడియోపై స్పందించిన అభిమానులు,ఐశ్వర్య-అభిషేక్‌ల మద్య ఎలాంటి విబేధాలు లేవని,బాలీవుడ్‌లో మోస్ట్ లవ్డ్ కపుల్‌ వీళ్ళే అని రూమర్స్‌ని నమ్మొద్దని,ఐశ్వర్య, అభిషేక్ బెస్టె కపుల్”అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఐశ్వర్య రాయ్‌ ప్రస్తుతం సినిమాల కంటే కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్‌ సెల్వన్‌ 2లో నటించారు. మరోవైపు, అభిషేక్ బచ్చన్ కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Related Posts
Ott streaming: కాలేజీలో 42 ప్రేతాత్మలు – ఆది పినిశెట్టి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ott streaming: కాలేజీలో 42 ప్రేతాత్మలు – ఆది పినిశెట్టి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

శబ్దం మూవీ ఓటీటీలోకి – హారర్ థ్రిల్లర్ లవర్స్‌కు థ్రిల్ గ్యారంటీ! హారర్, థ్రిల్లర్ జానర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించే ఓటీటీ ప్రపంచంలో మరో ఆసక్తికరమైన సినిమా Read more

Ram Charan: చరణ్ అభిమానులకు శ్రీరామనవమి కానుకగా- ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6న విడుదల!
Ram Charan: చరణ్ అభిమానులకు శ్రీరామనవమి కానుకగా- ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో ఏప్రిల్ 6న విడుదల!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్రం ‘పెద్ది’ – ఎపిరిల్ 6న అప్‌డేట్! తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అగ్రస్థాయి నటుడిగా గుర్తింపు పొందిన Read more

Vijay Deverakonda: బాలీవుడ్ ఇబ్బందులో ఉందన్నవిజయ్ దేవరకొండ
Vijay Deverakonda: బాలీవుడ్ ఇబ్బందులో ఉందన్నవిజయ్ దేవరకొండ

బాలీవుడ్ క్షీణత: కారణాలు ఏమిటి? కొన్నేళ్లుగా బాలీవుడ్ సినీ పరిశ్రమ తన పూర్వ వైభవాన్ని కోల్పోతూ వస్తోంది. చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలు తక్కువగా రావడం, సరికొత్త కథనాలతో Read more

Vishwambhara: విశ్వంభర టీజర్ కు జాన్వీ రియాక్షన్ చూశారా..?
telugu samayam 1

జాన్వీ కపూర్: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్‌పై బాలీవుడ్ బ్యూటీ రియాక్షన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం "విశ్వంభర". Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×