టాలీవుడ్‌లో నటి, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల తాజాగా మరో సినిమాను ప్రకటించారు. 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన స్థానాన్ని బలపరిచుకున్న నిహారిక, ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ‘కమిటీ కుర్రోళ్లు’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి వసూళ్లను సాధించింది. కొత్త నటీనటులు నటించిన ఈ చిత్రానికి వచ్చిన స్పందన నిహారికకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.తాజాగా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో రెండో చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిహారిక అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. మానస శర్మ ఇప్పటి వరకు ఎన్నో క్రియేటివ్ ప్రాజెక్ట్స్‌కి రచయితగా పని చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మారి ప్రేక్షకులకు వినూత్నమైన కథను అందించేందుకు సిద్ధమయ్యారు.
రెండో సినిమా
నటిగా మంచి మార్కులు దక్కించుకోలేకపోయిన నిహారిక నిర్మాతగా సత్తా చాటుతుంది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది, ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమాతో పలకరించబోతుంది. నేడు నిహారిక తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్న నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించబోతున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, 3 రోజెస్, పలు సిరీస్ లతో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ ఇందులో మెయిన్ లీడ్ పోషించబోతున్నాడు.
సంగీత్ శోభన్
ఈ సినిమాలో హీరోగా టాలీవుడ్ యువ నటుడు సంగీత్ శోభన్ నటించనున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సంగీత్, ఈ ప్రాజెక్ట్‌లో సోలో హీరోగా నటించనుండటం విశేషం. ఇప్పటి వరకు అతను మల్టీ-స్టారర్ లేదా భాగస్వామ్య పాత్రల్లో కనిపించినప్పటికీ, ఈ సినిమా ద్వారా పూర్తి హీరోగా తన పరిధిని విస్తరించనున్నారు.సంగీత్ తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిహారిక బ్యానర్‌లో హీరోగా నటించేందుకు సిద్ధమవ్వడం ఇండస్ట్రీలో ఈ మూవీ పై బారీ అంచనాలున్నాయి.నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగం అయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయితగా పని చేశారు. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగత్ శోభన్ ప్రధాన పాత్ర పోషించారు. ఇక సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి మానస శర్మ దర్శకురాలిగా పని చేశారు.ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌కి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.