ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) మధ్య టికెట్ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ హెచ్ యాజమాన్యం హెచ్‌సీఏ తమతో అనుచితంగా ప్రవర్తించిందని, బెదిరింపులకు పాల్పడిందని ఆరోపిస్తూ, పరిస్థితి మారకపోతే హైదరాబాద్‌ను వదిలి కొత్త వేదిక కోసం వెతుకుతామని హెచ్చరించింది. అయితే, హెచ్‌సీఏ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని స్పష్టం చేసింది.
ఎస్ఆర్ హెచ్
గత 12 సంవత్సరాలుగా హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, గత రెండేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం, హెచ్‌సీఏకి 3,900 ఉచిత టికెట్లు అందిస్తున్నామని, అందులో 50 టికెట్లు ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్‌కు కేటాయించారని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆ బాక్స్ సామర్థ్యం 30 టికెట్లకే పరిమితమని, అయినా హెచ్‌సీఏ అదనంగా 20 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది.
ఆరోపణలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహనరావుపై, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సన్‌రైజర్స్ సంస్థ ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ తమపై తీవ్ర ఒత్తిడిని తెచ్చిందని,పాస్‌లు ఇవ్వకపోతే ఆ సంస్థ బయటకు వెళ్లిపోతామని హెచ్చరించింది.

విచారణ
సన్‌రైజర్స్ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఈ వివాదంలో నిజనిజాలు రాబట్టేందుకు ఈరోజు ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. విజిలెన్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
హెచ్‌సీఏలో అక్రమాలు
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు, మైదానం సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. టికెట్ల విక్రయం, పాస్‌ల జారీ తదితర విషయాలను అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, గతంలోనూ హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఉప్పల్ స్టేడియంలో తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే.ఇప్పటికే స్టేడియం మొత్తం తమ నియంత్రణలోకి వస్తుందని, దీనికి అద్దె కూడా చెల్లిస్తున్నామని ఎస్ఆర్ హెచ్ పేర్కొంది. ఎస్ఆర్ హెచ్ ప్రకటన ప్రకారం, ఇది ఒక్క సంఘటన కాదు. గత రెండు సీజన్లుగా హెచ్‌సీఏ తమ సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, ఈ విషయాన్ని హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం రాలేదని ఎస్ఆర్ హెచ్ తెలిపింది.