Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..

Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..

ఇండియా లో 2025 సంవత్సరానికి అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తుల జాబితా విడుదలైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకోవడం విశేషం.2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఏడాదిలోనే 11 స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్ సాధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Advertisements

తెలంగాణ అభివృద్ధి

రైతు, మహిళా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం అనేక వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో గుర్తింపుని అందించింది.రైతు కుటుంబాలకు రూ. 21,000 కోట్ల రుణమాఫీ,క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్,మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్లు ఏర్పాటు,యువత నైపుణ్యాభివృద్ధి కోసం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపన,ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగావకాశాలు,

రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరగడానికి కారణాలు

తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు,రాజకీయ వ్యూహాలు, పాలనలో తీసుకువచ్చిన మార్పులు,తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించే చర్యలు,దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై స్పష్టమైన, ధైర్యమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం.

Revanth Reddy 2 V jpg 442x260 4g

రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభావం

నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించడం,ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతతో సమన్వయం చేయగల మేధో సంపత్తి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందడం,ఇండియా కూటమిలోని ఇతర ముఖ్యమంత్రులతో నిలబడి కీలక నేతగా ఎదగడం.ఈ జాబితాలో రేవంత్ రెడ్డి స్థానం పొందడం, భారతీయ రాజకీయాల్లో ప్రధాన మార్పుకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రాంతీయ నాయకులు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

పీసీసీ అభిప్రాయం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,”ఈ గుర్తింపుతో రేవంత్ రెడ్డిపై ప్రజల బాధ్యత మరింత పెరిగింది. పారదర్శక పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్న కారణంగా ఈ గుర్తింపు లభించింది” అని తెలిపారు.భారతదేశ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానం పొందడం, ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదుగుతున్నడన్నదానికి నిదర్శనం. భవిష్యత్తులో ఆయన మరింత పెద్ద పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌వించారనిచెప్పుకొవచ్చు. శ‌క్తిమంతులైన వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

Related Posts
రేషన్ కార్డులకు ఈ మార్గదర్శకాలు తప్పనిసరి
Ration Card Holders

భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.. ఇవి ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉన్నాయి. దీనిలో భాగంగానే జాతీయ ఆహార భద్రతా చట్టం Read more

లోక్‌సభ ముందుకు జమి ఎన్నికల బిల్లు
one nation one poll to be introduced in lok sabha on december 16

న్యూఢిల్లీ: ఒకే దేశం- ఒకే ఎన్నికలు' బిల్లు ఈ నెల 16న లోక్‌సభ ముందుకు రానుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ బిల్లును లోక్‌సభలో Read more

మహిళల కోసం కొత్త కార్యక్రమాలు – మంత్రి సీతక్క
sithakka womens

మహిళల కోసం కొత్త కార్యక్రమాలు! తెలంగాణలో మహిళల సాధికారతకు కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క Read more

Donald Trump: ట్రంప్ కొత్త విధానాలు – విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు
ట్రంప్ కొత్త విధానాలు - విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు, కళాశాలలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా లేదా పాలస్తీనా అనుకూల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×