ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

Mark Carney: ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌… కెన‌డా ఆటో రంగంపై అధిక సుంకాన్ని విధించ‌డం ప‌ట్ల ఆ దేశ ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటుగా స్పందించారు. అమెరికాతో పాత దోస్తీ ముగిసిందని తెలిపారు. కెనడా, అమెరికా మధ్య ఇన్నాళ్లు ఉన్న‌ ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాల యుగం ముగిసింద‌ని ప్రధాన మంత్రి గురువారం అన్నారు.
కెన‌డా నుంచి వాహనాల దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తూ ఇటీవ‌ల‌ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. వచ్చే వారం ఇది అమల్లోకి రానుంది. ట్రంప్ నిర్ణ‌యం 5,00,000 మంది ఉద్యోగులు ఉన్న‌ కెనడియన్ ఆటో పరిశ్రమకు చేటు చేస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని పేర్కొన్నారు.

Advertisements
 ట్రంప్‌ అధిక సుంకాన్ని విధించ‌డంపై ప్ర‌ధాని మార్క్ కార్నీ ఘాటు స్పంద‌న‌

ట్రంప్ ఆటో సుంకాలను అన్యాయమైనది
ట్రంప్ ఆటో సుంకాలను ‘అన్యాయమైనది’ గా ఆయన అభివర్ణించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘన‌గా మార్క్ కార్నీ పేర్కొన్నారు. ట్రంప్ అమెరికాతో సంబంధాలను శాశ్వతంగా మార్చేశారని, భవిష్యత్తులో ఏవైనా వాణిజ్య ఒప్పందాలు ఉన్నా తాము వెనక్కి తగ్గ‌బోమ‌ని ఆయన తెలిపారు. ఆటో సుంకాలకు వ్యతిరేకంగా కెనడా ప్రతీకారం తీర్చుకుంటుందని ప్ర‌ధాని చెప్పారు. “అమెరికాపై గరిష్ట ప్రభావాన్ని చూపే, కెనడాపై కనీస ప్రభావాన్ని చూపే మా సొంత‌ ప్రతీకార వాణిజ్య చర్యలతో మేము అగ్ర‌రాజ్యం సుంకాలను ఎదుర్కొంటాం” అని ఆయన అన్నారు.
ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు
కాగా, మార్చి 14న జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్‌ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులైన విష‌యం తెలిసిందే. సాధారణంగా ఒక కొత్త కెనడా నాయకుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడటం ఆన‌వాయితీ. కానీ ట్రంప్, కార్నీ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడుకోలేదు.

Related Posts
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. భారతీయుల మృతి
Russia Ukraine war.. Indian

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్న వీరిలో ఇంకా 16 మంది అదృశ్యంగా ఉన్నారని Read more

రూ.800, రూ.900 నాణేలు చూసారా?
అరుదైన నాణేలు! రూ.800, రూ.900 వెండి నాణేలు గురించి తెలుసా?

మనకు రోజూ కనిపించే రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలతోపాటు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మింట్ లిమిటెడ్ ఎడిషన్ Read more

ట్రంప్ టీమ్ లోకి శ్రీరామ్ కృష్ణన్
sriram krishnan

జనవరి మాసంలో అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన మంత్రివర్గాన్ని విస్తరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో ఇండియన్ అమెరికన్ కు చోటు దక్కింది. Read more

అమెరికా కంపెనీ: ఉద్యోగుల భద్రతా కోసం కొత్త విధానం..
feedback

ఉద్యోగులు మరియు మేనేజర్ల మధ్య వ్యత్యాసాలు, అసంతృప్తి భావనలు పుట్టించడంలో సాధారణంగానే సమస్యలు ఉండవచ్చు. అయితే, ఒక అమెరికా కంపెనీ ఉద్యోగుల అసంతృప్తిని వినడానికి మరియు వాటిని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×