సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

Donald Trump: సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, మెక్సికో, కెనడాల మాదిరి భారత్‌తో అమెరికా ప్రవర్తించకపోవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. భారత్‌తో తమకు టారిఫ్‌ సమస్య మాత్రమే ఉందని వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధుల బృందం వెల్లడించినట్లు తెలిసింది.

Advertisements
సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ప్రతీకార సుంకాలు వచ్చేనెల 2 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలను ముమ్మరం చేశాయి. టారిఫ్‌లపై చర్చించేందుకు ఈనెల మెుదట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాకు వెళ్లారు. తాజాగా అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ప్రతినిధి బృందం దిల్లీలో పర్యటిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
సజావుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతిపాదిత టారిఫ్‌ల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. కొన్ని కీలక రంగాలకు చెందిన ఉత్పత్తులపై తక్కువ టారిఫ్‌ ఉండేలా అమెరికా ప్రతినిధి బృందంతో, కేంద్ర వాణిజ్య శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నారని జాతీయ మీడియా పేర్కొంది.
అమెరికా ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు చెందిన 87 శాతం ఉత్పత్తులపై ప్రభావం పడొచ్చని కేంద్ర ప్రభుత్వం జరిపిన అంతర్గత విశ్లేషణలో వెల్లడైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ యోచిస్తోందని తెలిపింది. వచ్చేనెల రెండు లోపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

Related Posts
Myanmar : ఇప్పటివరకు మృతుల సంఖ్య ఎంతంటే…!
Maynmar Earthquake:మయన్మార్‌లో మళ్లీ భూకంపం..

మయన్మార్‌లో వచ్చిన తీవ్రమైన భూకంపం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ ప్రకృతి విపత్తు అనేక ప్రాణాలను బలిగొంటూ, వేల మందిని నిరాశ్రయులను చేసింది. తాజా సమాచారం Read more

Donald Trump: 5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు చేసిన ట్రంప్
టారిఫ్‌లపై అమెరికా ప్రతీకారం - వైట్‌హౌస్ స్పందన

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్, వలసదారుల విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.అక్రమ వలసదారులపై ఇప్పటికే కఠిన చర్యలుట్రంప్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా Read more

Day In Pics: జ‌న‌వ‌రి 07, 2025
day in pic 7 1 25

మంగ‌ళ‌వారం ల‌క్నోలోని పార్టీ కార్యాల‌యంలో మీడియాతో ఎస్ పి అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ న్యూఢిల్లీలో మంగ‌ళ‌వారం సిబిఐ ‘భారత్‌పోల్’ పోర్టల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోం Read more

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత
ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించినట్టు ఆరోపణలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×