Vamsi Vallabhaneni be825d3a8b v jpg

Vallabhaneni Vamsi: వల్లభనేని కేసు లో నేడు సీఐడీ కోర్టు తీర్పు

గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు సీఐడీ కోర్టు తీర్పును వెల్లడించనుంది. మంగళవారం నాటి విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగియగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.వంశీకి బెయిల్ వస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఆరోపణలు

టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రేరేపించారని ఆరోపణలు ఉన్నాయి.ఘటన జరిగిన సమయంలో దాడికి సంబంధించి మార్గదర్శకత్వం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ కోర్టులో వాదనలు వినిపించింది.

సీఐడీ వాదనలు

సీఐడీ తరఫున న్యాయవాదులు వంశీకి బెయిల్ మంజూరు చేయకూడదని వాదించారు.ఆయనకు బెయిల్ ఇస్తే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు.దాడి ఘటనలో వంశీ కీలక పాత్ర పోషించారని, విచారణను ఎదుర్కొనే వరకు ఆయనను జైల్లోనే ఉంచాలని అభ్యర్థించారు. ఈ కేసును రాజకీయ కక్షల్లో భాగంగా పెట్టారని,వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఆయన తప్పించుకునే ఉద్దేశ్యం లేదని, విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

398026 vamsi

కోర్టు తీర్పుపై ఉత్కంఠ

ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో కోర్టు తీర్పు ఈరోజు వెలువడనుంది.వంశీకి బెయిల్ వస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.కోర్టు తీర్పు,భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులపై ఎలా ఉండబోతుందనేదానిపై ఆశక్తి నెలకొంది.

బెయిల్

వంశీ బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది.సీఐడీ తరఫు వాదనలు – సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.వంశీ తరఫు వాదనలు – ఆరోగ్య సమస్యలు, రాజకీయ కక్షలో భాగంగా కేసు పెట్టారని న్యాయవాది వాదనలు వినిపించారు.తీర్పు వచ్చే వరకు ఉత్కంఠ నెలకొననుంది.వంశీ అనుచరులు, కుటుంబ సభ్యులు ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు.వంశీకి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే తప్పుడు ఆరోపణలు మోపారని వాదిస్తున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని వంశీ న్యాయవాదులు కోరుతున్నారు.వైసీపీ నేతలు మాత్రం న్యాయపరంగా విచారణ జరుగుతోందని, దాడికి కారకుడైన వంశీపై చర్యలు తీసుకోవడం సహజమని అంటున్నారు.ఇప్పటికే, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా, వంశీ జైల్లో సౌకర్యాలపై న్యాయాధికారితో చర్చించారు.

Related Posts
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కోడి పందేలు
crock fight

తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోడి పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు గుండాట, లోన బయట, పేకాటలు కూడా పందెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందు వంటి ప్రత్యేక ఏర్పాట్లతో Read more

Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కు వచ్చే నెల 4 వరకూ రిమాండ్
borugadda anil1

బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించింది. ఫిరంగిపురం పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ జారీ చేసి, ఈరోజు సివిల్ జడ్జి Read more

బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్
బొత్సకు అచ్చెన్నాయుడు కౌంటర్

ఏపీ శాసనమండలిలో ఆసక్తికర వాగ్వాదం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికర వాగ్వాదం చోటుచేసుకుంది. Read more

APలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు – TG భరత్
Orvakallu Industrial Park

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ విషయాన్ని వెల్లడించారు. జపాన్‌కు చెందిన యిటోయే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *