కమేడియన్‌‌పై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం

Yogi Adityanath: కమేడియన్‌‌పై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే‌పై స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా వేసిన జోకులను ఉటంకిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కొందరు దేశాన్ని ముక్కలు చేయడం, విభజనను విస్తృతం చేయడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారు’ అని యోగి మండిపడ్డారు.

Advertisements
కమేడియన్‌‌పై యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం

తీవ్ర దుమారంకు కారణాలు
ముంబయిలో ఆదివారం జరిగిన ఓ షోలో కునాల్ కమ్రా.. ఏక్‌నాథ్ షిండేను ద్రోహి అంటూ జోకులు పేల్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాను క్షమాపణ చెప్పేది లేదని, ఒకవేళ కోర్టు తాను తప్పుచేశానని ఆదేశిస్తే చెబుతానని కునాల్ కమ్రా స్పష్టం చేశారు. తనకు 500కిపైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు.
కాంగ్రెస్‌పై యోగి ఆదిత్యనాథ్ పలు విమర్శలు
ఇక, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌పై యోగి ఆదిత్యనాథ్ పలు విమర్శలు గుప్పించారు. అమెరికా కుబేరుడు జార్జ్ సోరెస్ నుంచి తీసుకున్న డబ్బుతో 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. అలాగే, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కోటా బిల్లును తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిందని ధ్వజమెత్తారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియా కూటమిలో పార్టీలు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా విదేశీ నగదును ఉపయోగించి ప్రభావితం చేసే ప్రయత్నం చేశాయి’ అని యోగి ఆరోపణలు చేశారు.
కాగా, కమేడియన్ కమ్రా.. ముంబయిలో ఆదివారం నిర్వహించిన షోలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఉద్దేశిస్తూ జోకులు పేల్చారు. ‘‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది.. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది.. అంతా గందరగోళంగా ఉంది’’ మరాఠా రాజకీయాల గురించి మాట్లాడారు. అలాగే, షిండే ద్రోహిగా అభివర్ణించించిన కునాల్.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే బాలీవుడ్ సినిమా పాటలోని చరణాలను రాజకీయాలను అనుగుణంగా మార్చి వ్యంగ్యంగా పాడారు.

Related Posts
Delhi Election Results : కేజ్రీవాల్‌ పరాజయం..
Delhi Election Results.. Kejriwal defeat

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్‌ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. Read more

మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.
మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రాంతంలో 19 జనవరి ఆదివారం సాయంత్రం ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్లు పేలి జరిగినట్టు తెలుస్తోంది.గీతా Read more

అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో Read more

బీజేపీ ఆదాయం 4340 కోట్లు
BJP income is 4,340 crores!

2023-24 ఏడీఆర్‌ నివేదిక న్యూఢిల్లీ : బీజేపీ ఆదాయం 4340 కోట్లు.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×