రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

Rahul gandhi: రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు గడువు నిర్దేశించింది. నాలుగు వారాల్లో పౌరసత్వం అంశం తేల్చాలని సూచించింది. అయితే కేంద్రం- న్యాయస్థానానికి 8 వారాల గడువు కోరగా, నాలుగు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను లఖ్‌నవూ బెంచ్‌ ఏప్రిల్‌ 21కి వాయిదా వేసింది. ఆ లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ను కేంద్రం కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
కొన్నేళ్లుగా పౌరసత్వంపై రగడ
రాహుల్‌ గాంధీ పౌరసత్వం అంశంపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యర్త విఘ్నేశ్‌ శిశిర్ వేసిన పిటిషన్లపై న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.

రాహుల్‌ గాంధీ పౌరసత్వంపై కేంద్రానికి గడువు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు

బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ
బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్‌ గాంధీ డైరెక్టర్
, సెక్రటరీగా ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కొంత కాలంగా ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో తనను తాను బ్రిటిష్‌ పౌరుడిగా రాహుల్​ గాంధీ పేర్కొన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. వేరే దేశంలో పౌరుడిగా ఉన్న వ్యక్తి భారత దేశ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అలా చేయకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ని ఉల్లంఘించడమే అవుతుందని స్వామి పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలో కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు. మరోవైపు తన వద్ద రాహుల్‌గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నాయని విఘ్నేశ్‌ చెబుతున్నారు.

Related Posts
బీజేపీ సభలో జేబుదొంగల బీబత్సం
midhun chakravarthi

ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోచేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి Read more

నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం
7.1 magnitude earthquake hits Nepal

న్యూఢిల్లీ: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం రాగా దాని ప్రభావం ఉత్తర భారతదేశంలో కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ తో పాటు Read more

Bharat Ratna: లాలూకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనలను తిరస్కరించిన అసెంబ్లీ
లాలూకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనలను తిరస్కరించిన అసెంబ్లీ

మన దేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే భారతరత్న అవార్డు కోసం అన్ని రాష్ట్రాలు పలువురి పేర్లను సిఫారసు చేస్తూ Read more

ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..
Non stop bomb threats to Delhi schools

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *