మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు

Andhra: మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు

మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు నిందితుల అరెస్టు చేశారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేశ్​తో పాటు ఆ మహిళను అరెస్టు చేసి వారిని ఆదివారం రిమాండ్​కు​ తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. ధనుంజయ్ ట్రాప్‌లో చిక్కుకుని.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు.. ఎంక్వైరీ చేయగా డొంక కదిలింది. ధనుంజయ్ గ్యాంగ్ చాలామందిని మోసం చేసిందని గుర్తించారు. ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహిళ సహా నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు లేపాక్షి మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయ్యే అధికారుల జాబితాలో లా అండ్ Read more

కుంభ‌మేళాకు నారా లోకేశ్‌
కుంభ‌మేళాకు నారా లోకేశ్‌

ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్ర‌యాగ్‌రాజ్ లో మహాకుంభమేళాకు పర్యటించేందుకు ఈ రోజు బయలుదేరారు. ఆయన షాహి స్నానఘట్టంలో పవిత్ర స్నానం Read more

వెంకటపాలెంలో అట్టహాసంగా శ్రీనివాస కల్యాణం
srinivasa kalyanam in venka

ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల ఉత్సాహంతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో Read more

మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టడం పై పవన్ స్పందన
Pawans reaction on naming

మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి పేరు పెట్టినందుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *