కామెడీ షోతో భగ్గుమన్న మహారాష్ట్ర రాజకీయాలు

Viral Video: కామెడీ షోతో భగ్గుమన్న మహారాష్ట్ర రాజకీయాలు

కామెడీ షోలో సభికులు చప్పట్లు కొడుతుంటే కమెడియన్‌ రెచ్చిపోయాడు. వెనకా ముందు చూసుకోకుండా కామెడీ పండించాడు. తన స్కిట్‌లోకి రాజకీయ నాయకులను లాగాడు. ఏకంగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై జోకులు పేల్చాడు. అంత వరకు అయితే పర్వాలేదు అనుకున్నారు. కానీ, ఆయనను దేశద్రోహిగా పేర్కొన్నాడు. ఇంకేముంది రాజకీయ దుమారం చెలరేగింది. స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఇది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీంతో కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కామెడీ షోతో భగ్గుమన్న మహారాష్ట్ర రాజకీయాలు

ఏక్‌నాథ్‌ శిండేను ద్రోహిగా చిత్రీకరణ
ఖార్‌ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్‌ హోటల్‌లోని హాబిటాట్‌ కామెడీ క్లబ్‌లో కునాల్‌ కమ్రా షో నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేను ఉద్దేశిస్తూ కమ్రా ఓ జోక్‌ పేల్చాడు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉంది అంటూ మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్‌.. ఏక్‌నాథ్‌ శిండేను ద్రోహిగా చెప్పుకొచ్చాడు.

పోస్టులో ఏంవుంది?
ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ‘కునాల్‌ కా కమల్‌’ అంటూ పోస్టులో రాశాడు. దీంతో ఇదికాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. కమెడియన్‌ కమ్రా వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు.
కమెడియన్‌ కునాల్‌ కమ్రాపై కేసు నమోదు..
కమెడియన్ కునాల్‌ కమ్రాపై చర్యలు తీసుకోవాలని శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కమ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. హోటల్‌పై దాడిని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్‌ పాడిన పాటలో వంద శాతం నిజమే ఉందన్నారు ఠాక్రే. కుట్రపూరితంగానే హోటల్‌పై దాడి చేశారని ఆరోపించారు.

Related Posts
నేను బతకడం కష్టమే అన్నారు..సోనాలి బింద్రే
Sonali Bendre

సోనాలి బింద్రే ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ కీలకమైన ఘట్టం గురించి తన అభిమానులతో భావోద్వేగంగా, సరళంగా మాట్లాడారు. ఆ కష్టకాలంలో ఉన్న అనుభవాలను పంచుకుంటూ Read more

మంచు లక్ష్మీ ఎమోషనల్ పోస్ట్
manchu laxmi

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన భావాలను వ్యక్తపరుస్తుంటారు. అయితే, ఇటీవల ఆమె పెట్టిన కొన్ని ఆసక్తికరమైన పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Read more

Nirmala Sitharaman: ఆలయ ప్రసాదాల పై జీఎస్టీ మినహాయింపు: నిర్మలా సీతారామన్

ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ మినహాయింపు: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన పార్లమెంటులో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలయ ప్రసాదాలకు జీఎస్టీ Read more

paytm :పేటీఎం షేర్లు పతనం .. ఒక్కరోజులో 5% ఢమాల్
పేటీఎం షేర్లు పతనం .. ఒక్కరోజులో 5% ఢమాల్

స్టాక్ మార్కెట్ నష్టాల నుండి తిరిగి కోలుకుంటూ ఊపందుకుంటున్న సమయంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (పేటీఎం) షేర్లు గురువారం పతనమయ్యాయి. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *