KCR:టీడీపీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన కెసిఆర్

KCR:టీడీపీ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన కెసిఆర్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని మార్చుకుని మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. గత పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యింది.తెలంగాణ ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ ప్రత్యేక శైలితో ముందుకు సాగింది. ఉద్యమాన్ని నడిపిన విధానం, అనంతరం ప్రభుత్వాన్ని నిర్వహించిన తీరు ప్రత్యేకంగా నిలిచాయి. కానీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఇప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు కొత్త సందేశాలతో ముందుకొస్తున్నారు.ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు,ప్రతి ఒక్కడూ కేసీఆరేఅనే నినాదం పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

క్యాడర్‌లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం

ఎవరూ శాశ్వతంగా ఉండిపోరుపార్టీ ఫీనిక్స్‌ప్రతి ఒక్కడూ కేసీఆరే.మళ్లీ బీఆర్‌ఎస్ సింగిల్‌గానే అధికారంలోకి వస్తుందిఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్‌ క్యాడర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పరాభవంతో చతికిలపడిన పార్టీని ట్రాక్‌లో పెట్టేందుకు బీఆర్ఎస్‌ పెద్దలు మరో సారి వినూత్నశైలిలో ముందుకెళ్తున్నారు.

టీడీపీ పై కామెంట్స్

ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని,కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.మనం తెచ్చిన తెలంగాణ.. మన పాలనలోనే బాగుంది.. మళ్లీ మనమే వస్తాం అంటూ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్‌. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు.

kcr says no chance of alliances

సీతక్క కౌంటర్

బీఆర్ఎస్ నాయకుల విమర్శలకు కాంగ్రెస్ మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.మీ క్యాడర్‌ను ఊహాలోకంలో ఉంచండి,మీరు ఫామ్‌హౌస్‌లోనే ఉండండి,ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండిఅంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ మాటలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

రాజకీయ సమీకరణాలు

బీఆర్ఎస్ నాయకత్వం కేడర్‌ను ప్రేరేపించేందుకు విస్తృతంగా యత్నిస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విధానాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయా అన్నది తేలాల్సి ఉంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాలు తెలంగాణ రాజకీయ రంగాన్ని ఏ మార్గంలో నడిపిస్తాయో చూడాలి.

Related Posts
కుప్ప‌కూలి.. పేలిన ఎఫ్‌-35 యుద్ధ విమానం..
F 35 fighter jet crashes at Alaska Air Force base after pilot ejects

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన ఎఫ్‌-35 యుద్ధ విమానం(F-35 Crash) కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న అల‌స్కాలోని ఎలిస‌న్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జ‌రిగింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు Read more

పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు
పల్నాడు జిల్లా లో రెచ్చిపోతున్న వాహన దొంగలు

ఆంధ్రప్రదేశ్ లో ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాహనాల దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రివేళ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లు, ఆటోలు టార్గెట్ చేస్తూ ముఠాలు చోరీలకు Read more

భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ
LOKESH DAVOS

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ చైర్మన్ కళ్యాణితో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రక్షణ పరికరాల తయారీకి Read more

ఆంధ్రప్రదేశ్‌లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి, కొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మరియు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2024లో మూడవసారి ప్రధాన మంత్రిగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *