ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్

Trump:టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ రూట్ మార్చారు. ఇప్పటివరకూ పూర్తి స్వేచ్ఛనిచ్చిన ట్రంప్‌, తొలిసారి అందుకు భిన్నంగా స్పందించారు. మస్క్‌కు ఉన్న వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో అమెరికా యుద్ధ ప్రణాళికలను పంచుకోకూడదని వెల్లడించారు. మస్క్‌కు చైనాలోనూ వ్యాపారాలున్నాయని, కాబట్టి ఆయన ప్రభావితం కావొచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఓవల్‌ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ అధికారులు యుద్ధ తంత్రాలకు సంబంధించిన కొన్ని రహస్య ప్రణాళికలను మస్క్‌కు వివరించనున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనం చర్చనీయాంశమైన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

చైనాతో యుద్ధం వస్తే ..
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ(డోజ్‌) సారథిగా ఉన్న మస్క్‌ శుక్రవారం పెంటగాన్‌కు వెళ్లారని, అక్కడ నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంపై మాత్రమే ఆయన చర్చించారని ట్రంప్‌ వివరించారు. చైనాతో యుద్ధం వస్తే అమెరికా ఎలా ఎదుర్కోవాలో తెలిపే ప్రణాళికలను మస్క్‌కు అధికారులు వివరించలేదని క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు పెంటగాన్​కు చేరుకున్న మస్క్​కు అక్కడి అధికారులు స్వాగతం పలికారు. రికి కూడా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలు
మరోవైపు ఎలాన్‌ మస్క్​కు చెందిన టెస్లా విద్యుత్‌ కార్ల సంస్థ ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేందుకు మంచి అవకాశం ఉందని ట్రంప్‌ వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ఈ దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లతోపాటు కార్ల పైనా ఇటీవల దాడులు జరిగాయి. భద్రత కరవైందన్న కారణంగా కెనడాలో అంతర్జాతీయ వాహన ప్రదర్శన నుంచి టెస్లా తన ఉత్పత్తులను వెనక్కి తీసుకుంది.

Related Posts
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?

కేంద్రం, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించడానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాలను, ఎంపికలను ఆయన కుటుంబ సభ్యులకు పంపాలని సూచించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి Read more

బడ్జెట్ లో ఏపీ రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత ఎంత?
nirmala sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ద్వారా తాయిలాలను ప్రకటించటానికి కేవలం మరో 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈసారి బడ్జెట్లో Read more

Karantaka Assembly: మగాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి : ఎమ్మెల్యే అభ్యర్థన
Give men two free bottles a week.. MLA request

Karantaka Assembly : కర్ణాటక అసెంబ్లీలో ఎక్సైజ్ రెవిన్యూ ఎలా పెంచాలన్న దానిపై జరిగిన చర్చ.. మద్యం బాటిళ్లు ఉచితంగా అందించాలనే దానిపైకి వెళ్లింది. ఓ సీనియర్ Read more

Bhupesh Baghel: మాజీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు
మాజీ సిఎం ఇంట్లో సిబిఐ సోదాలు

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌పై కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరపగా, తాజాగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *