టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున ఖర్చు తగ్గింపు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వేగంగా అమలు చేయడం. కానీ ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం ప్రత్యేకంగా కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రొఫెషనల్ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్లు ప్రకటించింది.

టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

40కి పైగా అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్
ఇండియాలో ప్రముఖ ఐటీ కంపెనీగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ 40కి పైగా అనుభవజ్ఞులైన టెక్ ప్రొఫెషనల్స్ నియమించుకోనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్ నెట్, ఆండ్రాయిడ్ iOS డెవలప్‌మెంట్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ వంటి రంగాలలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారికీ మంచి ప్యాకేజితో ఉద్యోగ అవకాశాలు అందించనున్నట్లు వెల్లడించింది.
ఇన్ఫోసిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
అదేవిధంగా గత సంవత్సరం ఇన్ఫోసిస్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొంతమంది ప్రొఫెషనల్స్’ని సెలక్ట్ చేసింది. ఆ సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొనడానికి బెంగళూరు, చెన్నై ఇంకా హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ ఆఫీసులకు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన సమాచారం ఇంటర్నల్ కమ్యూనికేషన్ ద్వారా అందించినట్లు నివేదించింది. ఇంటర్వ్యూకి ఎక్కడికి రావాలో సలెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇన్ఫోసిస్ వారికే ఇచ్చింది. మూడు సంవత్సరాల క్రితం కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇన్ఫోసిస్ బెంగళూరు ఆఫీస్ నుండి వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొఫెషనల్స్’ని రిక్రూట్ చేసుకుంది.
20 వేల మంది ఫ్రెషర్ల నియామకం
అంతేకాదు ఈ ఏడాది అంటే 2025లో 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీనితో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని కూడా నియమించుకోవడానికి ఇలాంటి ఆఫర్ చేసింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ 3.23 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల ప్లేస్మెంట్లను భర్తీ చేయడానికి అలాగే కొత్త ప్రాజెక్టులకు ఫ్రెషర్లను సెలెక్ట్ చేయడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇది కాకుండా ఇన్ఫోసిస్ గత నెలలోనే 600 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్ లెటర్లను జారీ చేసింది. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని ఇన్ఫోసిస్ 600 మంది యువతకు ఉపాధి కల్పించింది.
గత 9 నెలల్లో ఇన్ఫోసిస్‌లో ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారికి ఇప్పుడు అవకాశం ఇవ్వబోమని కూడా సమాచారం. గత నెలలో ఇన్ఫోసిస్ 300 మందికి పైగా ఎంట్రీ లెవల్ ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించడంతో వివాదంలో చిక్కుకుంది. ఇందుకు ఫ్రెషర్లను నియమించుకుని వారికి శిక్షణ ఇచ్చి కొన్ని ఎలిజాబిలిటీ టెస్టులను కూడా నిర్వహించింది.

Related Posts
బై..బై చెపుతూ ‘బైడెన్’ సంచలన నిర్ణయం
joe biden comments

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవి ముగియడానికి కొద్ది గంటల ముందు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కోవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా. ఆంటోనీ Read more

CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!
CricketNews :పంజాబ్ కింగ్స్ కి బిగ్ షాక్!

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్‌ను మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో Read more

పులి నోటికి చిక్కిన పిల్లాడి మాటలు.. వీడియో వైరల్
పులి నోటికి చిక్కిన పిల్లాడి మాటలు.. వీడియో వైరల్

సాధారణంగా ఎవరైనా పెద్ద పులి నోటికి చిక్కితే అమ్మా.. అయ్యా అని ఏడుపులు స్టార్ట్ చేస్తారు. నన్ను రక్షించండి, కాపాడండి అని కేకలు వేస్తారు. కానీ ఈ Read more

Rahul gandhi: ఆర్‌ఎస్‌ఎస్ విద్యను తన ఆధీనంలోకి తీసుకుంటే దేశం నాశనమే: రాహుల్ గాంధీ
ఆర్‌ఎస్‌ఎస్ విద్యను తన ఆధీనంలోకి తీసుకుంటే దేశం నాశనమే: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, విద్యా వ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్ పెరుగుతున్న ప్రభావాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. విద్యా వ్యవస్థపై నియంత్రణను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *