Amaravathi :అమరావతిలో నిర్మాణం కానున్న అతిపెద్ద స్టేడియం

Amaravathi :అమరావతిలో నిర్మాణం కానున్న అతిపెద్ద స్టేడియం

ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం, దీనిని ముందు సర్దార్ పటేల్ స్టేడియం అని పిలిచేవారు. ఇందులో 110,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో భారీ స్టేడియం

1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో స్టేడియం నిర్మించనున్నట్టు వివరించారు. భారీ స్టేడియం నిర్మిస్తుండటంతో దాని పక్కన ప్రజా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలన్న ఏసీఏ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఐసీసీ చైర్మన్ జైషా కూడా అనుమతినిచ్చినట్టు పేర్కొన్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ

విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఏసీఏ తరపున ఢిల్లీ కేపిటల్స్‌ను అడిగితే విశాఖలో స్టేడియం బాగాలేదని తిరస్కరించారని, దీంతో మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుని స్టేడియాన్ని బాగు చేస్తే రెండు మ్యాచ్‌లు ఇస్తామని చెప్పారని శివనాథ్ గుర్తు చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే స్టేడియంను అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.

Andhra Cricket Association with BCCI support to build a new cricket stadium in Vishakapatnam

రంజీ మ్యాచ్‌ల నిర్వహణ

మంగళగిరి స్టేడియాన్నే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా తీర్చిదిద్దాలని అనుకున్నామని, కానీ లోపల నిర్మాణ ప్రాంతం దెబ్బతినడంతో సాధ్యం కాలేదని చెప్పారు. కాబట్టి ఆ స్టేడియంను రంజీ మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధం చేస్తామన్నారు. ఏడాదిలో 150 రోజులపాటు ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు శివనాథ్ వివరించారు. 

జిల్లా స్థాయి అభివృద్ధి

విజయవాడ, కడప, విజయనగరంలలో క్రికెట్ అకాడమీలు ప్రారంభిస్తున్నామని, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో స్టేడియాలు ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ క్రికెట్ గ్రౌండ్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు శివనాథ్ తెలిపారు.అమరావతిలో నిర్మించనున్న క్రికెట్ స్టేడియం ప్రపంచస్థాయి మైదానంగా మారనుంది.విశాఖ స్టేడియం పునరుద్ధరణ, మంగళగిరి స్టేడియాన్ని రంజీ మ్యాచులకు సిద్ధం చేయడం రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి దోహదం చేయనుంది.

Related Posts
Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం
Telangana : పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు పై కొనసాగుతున్న ప్రజాగ్రహం

హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, Read more

స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ) మరియు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యుఎస్) పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించి, స్వయం ఉపాధి సబ్సిడీ రుణ పథకాలకు కొత్త Read more

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు
train

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు Read more

గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్
Center is good news for Gun

NDA తో టీడీపీ జత కట్టడం తో ఏపీకి వరుస గుడ్ న్యూస్ అందజేస్తుంది కేంద్రం. ముఖ్యంగా రాష్ట్రానికి నిధుల సమస్య అనేది లేకుండా అవుతుంది. రాజధాని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *