వాహనాల ధరలను పెంచిన మారుతి సుజుకి

Maruti Suzuki : వాహనాల ధరలను పెంచిన మారుతి సుజుకి

సొంత కారు ఉండాలి అనేది చాల మంది కోరిక. అయితే మార్కెట్లో మధ్యతరగతి నుండి సంపన్నుల వరకు అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ధరలకు చాల కంపెనీల కార్లు. కానీ చాలమందికి తక్కువ మెయింటెనెన్స్ కార్ల గురించి ప్రస్తావన వచ్చినపుడు మారుతి సుజుకి పేరు వినిపిస్తుంది. అయితే ఇండియాలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయినా మారుతి సుజుకి కస్టమర్లకు షాకిస్తూ పెద్ద ప్రకటన చేసింది. దింతో కొత్త కారు కొనాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. కంపెనీ తాజాగా వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుండే ఈ పెంపు అమల్లోకి రానుంది.
ఈ వార్త వెలువడిన వెంటనే మారుతి సుజుకి లిమిటెడ్ షేర్లు బిఎస్ఇలో జోరందుకున్నాయి. దింతో మారుతి షేరు ధర ప్రస్తుతం రూ.11766 వద్ద ట్రేడవుతోంది.

Advertisements
వాహనాల ధరలను పెంచిన మారుతి సుజుకి

పెరగనున్న మారుతి సుజుకి కార్ల ధరలు
మారుతి సుజుకి ఇండియా ఏప్రిల్ 2025 నుండి కంపెనీ కార్ల ధరలను 4% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాలు, ఆపరేషన్స్ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అలాగే మోడల్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయని కూడా కంపెనీ తెలిపింది.
జనవరి 1 నుండి కూడా వాహన ధరలను పెంపుపై ప్రకటన
గతంలో ఈ ఏడాది జనవరి 1 నుండి కూడా వాహన ధరలను పెంపుపై ఓ ప్రకటన చేసింది, అప్పుడు కూడా ధరలను 4% పెంచింది. అంతే కాకుండా ఫిబ్రవరిలో చాల మోడళ్ల ధరలను రూ.1,500 నుండి రూ.32,500కి పెరిగాయి.

అధిక సుంకాలు : ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ధరల పెరుగుదల, ముడి పదార్థాలపై అధిక సుంకాలు కూడా ఆటోమొబైల్ కంపెనీలను ప్రభావితం చేస్తున్నాయి. దింతో భారతీయ కార్ల తయారీదారులు పెరిగిన ఖర్చులను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు సప్లయ్ చైన్ అంతరాయాలు ఈ సవాళ్లను మరింత తీవ్రతరం చేశాయి.

Related Posts
మహాకుంభ్‌ పై దీదీ ఘాటు వ్యాఖ్యలు
మహాకుంభ్‌ పై దీదీ ఘాటు వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను మృత్యు కుంభ్‌గా అభివర్ణిస్తూ, అక్కడ ఉన్న ప్రణాళికలపై Read more

ఉక్రెయిన్‌పై రష్యా దాడి..
russia ukraine war scaled

ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా తన భారీ మిసైల్, డ్రోన్ల దాడులను చేపట్టింది. ఈ దాడిలో రష్యా 200 కి పైగా ఆయుధాలను ఉక్రెయిన్‌లోని ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు Read more

స్ప్రింగ్ ఫెస్ట్ మళ్లీ వచ్చేసింది!
spring fest

స్ప్రింగ్ ఫెస్ట్ 66వ ఎడిషన్ జనవరి 24 నుండి జనవరి 26, 2025 వరకు జరగనుంది. స్ప్రింగ్ ఫెస్ట్ భారతీయ సాంకేతిక సంస్థ ఖరగ్‌పూర్ వార్షిక సాంస్కృతిక, Read more

కూంబింగుల్లో బయటపడిన భారీ ఆయుధాల డంప్‌
Huge arms dump found in Coombings

రాయ్‌పూర్‌: ఇటీవల భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×