దర్జాగా ఆరేళ్లుగా ఇంట్లోనే ఉంటూ జీతం తీసుకుంటున్నాడు..చివరికి పట్టుపడ్డాడు

Employee Fraud: దర్జాగా ఆరేళ్లుగా ఇంట్లోనే ఉంటూ జీతం తీసుకుంటున్నాడు..చివరికి పట్టుపడ్డాడు

చిన్న ఉద్యోగం అయినా కష్టపడి పని చేస్తాం. అలాంటిది సంవత్సరాలుగా పని చేయకుండానే జీతం తీసుకునేవారిని ఏమనాలి? ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వెళ్లకుంటే బాస్ తో అక్షింతలు తప్పవు.. నెలాఖరున జీతంలోనూ ఆమేరకు కోత పడకా తప్పదు. కానీ స్పెయిన్ లో ఓ ఉద్యోగి ఏకంగా ఆరేళ్ల పాటు ఆఫీసు ముఖమే చూడలేదు. వర్క్ ఫ్రం హోం చేశాడని అనుకునేరు.. అసలు పనే చేయలేదు. అయినా నెలనెలా ఠంచనుగా జీతం మాత్రం అందుకున్నాడు. సంస్థలోని రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడం ఆ ఉద్యోగికి కలిసి వచ్చింది. ఇరవై ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్నందుకు సదరు ఉద్యోగికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. దీంతో ఆ ఉద్యోగిపై కంపెనీ కోర్టుకెక్కింది. స్పెయిన్ లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

Advertisements
దర్జాగా ఆరేళ్లుగా ఇంట్లోనే ఉంటూ జీతం తీసుకుంటున్నాడు..చివరికి పట్టుపడ్డాడు


2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు
స్పెయిన్ లోని కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో జోయక్విన్ గార్సియా ప్లాంట్ సూపర్ వైజర్ గా పనిచేశారు. 1990లో ఉద్యోగంలో చేరిన గార్సియా.. 2004 వరకు సక్రమంగా విధులు నిర్వహించాడు. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయం గమనించిన గార్సియా.. 2004 నుంచి విధులు ఎగ్గొడుతూ వచ్చాడు.
బ్యాంకు ఖాతాలో నెలనెలా జీతం
డ్యూటీకి వెళ్లకపోయినా ఎవరూ గుర్తించకపోవడంతో గార్సియా జీతం నెలనెలా అతడి బ్యాంకు ఖాతాలో పడింది. ఏడాదికి 41,500 డాలర్లు (మన రూపాయలలో 36 లక్షలు) అందుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన గార్సియా వ్యవహారం 2010లో బయటపడింది. ఇరవై ఏళ్ల పాటు సంస్థకు సేవలందించిన నేపథ్యంలో గార్సియాకు సన్మానం చేయాలని ఉన్నతాధికారులు ప్రయత్నించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో గార్సియాపై కాడిజ్ వాటర్ కంపెనీ కోర్టుకెక్కగా.. ఇటీవల తీర్పు వెలువరించింది. గార్సియాకు 30 వేల డాలర్ల జరిమానా (మన రూపాయలలో 25 లక్షలు) విధిస్తూ తీర్పు చెప్పింది.

Related Posts
మస్క్ యొక్క మార్స్ ప్రాజెక్ట్ : స్టార్షిప్ టెస్ట్‌లో సాంకేతిక సవాళ్లు
starship failure

స్పేస్ఎక్స్ కంపెనీ తమ స్టార్షిప్ రాకెట్‌ను టెక్సాస్‌లోని ప్రణాళిక ప్రకారం ప్రయోగించగా,ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.స్టార్షిప్ రాకెట్ పరీక్షా ప్రొగ్రామ్‌ లో భాగంగా, దీని సూపర్ Read more

ట్రంప్ విధానాలు: అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్‌ పై సందేహాలు
university

డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో, ఆయన నాయకత్వంలో ఆవిష్కరించగల వివిధ విధానాలు, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపించవచ్చని అనుమానాలు Read more

గుండెపోటు నివారణకు అందుబాటులో వ్యాక్సిన్
గుండెపోటు నివారణకు అందుబాటులో వ్యాక్సిన్

ప్రస్తుతం గుండెపోటు, స్ట్రోక్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చైనా శాస్త్రవేత్తలు అథెరోస్క్లెరోసిస్‌ను నిరోధించే సంభావ్య వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. అథెరోస్క్లెరోసిస్ అనేది ధమనులలో కొవ్వు ఫలకం పేరుకుపోవడం Read more

టూరిస్ట్ మహిళ అత్యాచారం వేగంగా దర్యాప్తు
కర్ణాటకలో విదేశీ మహిళపై దారుణం – నిందితుల కోసం గాలింపు!

కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో విదేశాలకు చెందిన పర్యాటకులు దుండగుల దాడికి గురికావడం, ఓ వ్యక్తి మృతిచెందడం, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×