పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

Israel :పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

ప్రపంచమంతా రంజాన్ సీజన్లో హ్యాపీగా ఉంటే గాజాలో మాత్రం మారణహోమం జరుగుతున్నది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 69 మంది దుర్మరణం పాలయ్యారు.

పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు


కాల్పుల విరమణ కుదిరిన ఒప్పందం
నిజానికి- హమాస్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయడానికి కాల్పుల విరమణ కుదిరిన రెండు నెలల తర్వాత ఈ దాడులు తెరమీదికి వచ్చాయి. ఈ రెండు నెలల వ్యవధిలో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో దాదాపు 60 మందిని విడుదల చేసింది హమాస్.
69 మంది మరణించారు
ఈ పరిస్థితుల్లో తాజా దాడులు చోటు చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. గాజా అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇప్పటివరకు 69 మంది మరణించినట్లు గాజా ప్రకటించింది. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక మీడియా తెలిపింది.

Related Posts
గాజాలో 70% మరణాలు మహిళలు, పిల్లలు: ఐక్యరాజ్య సమితి నివేదిక
gaza scaled

గాజాలో జరుగుతున్న యుద్ధం మానవహీనతను మరింత పెంచింది. యూనైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. అందులో గాజాలో మరణించిన 70% మంది Read more

Bill Gates: భారత పర్యటనకు రానున్న బిల్ గేట్స్
Bill Gates: భారత పర్యటనకు రానున్న బిల్ గేట్స్

బిల్ గేట్స్ మరోసారి భారత పర్యటనకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. మూడేళ్లలో ఇది ఆయన మూడో భారత పర్యటన Read more

ట్రంప్ సంచలన నిర్ణయాలతో దేశాలకు వణుకు
trump

ఈ వారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక, ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం అందించడంపై ఆయన కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం Read more

బంగ్లాదేశ్ హైకోర్టు ISKCON పై నిషేధం నిరాకరించింది..
BANGLA HIGH COURT

బంగ్లాదేశ్‌లోని హైకోర్టు ఈ వారం ISKCON (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) సంస్థపై నిషేధం విధించడాన్ని నిరాకరించింది. దీనికి కారణం, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో అవసరమైన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *