రేపు పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడనున్న ట్రంప్?

Donald Trump: రేపు పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడనున్న ట్రంప్?

ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో మాట్లాడే అవ‌కాశాలు ఉన్నాయి. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వ‌న్‌లో ట్రంప్ రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ.. ఉక్రెయిన్, ర‌ష్యా శాంతి ఒప్పందంపై పుతిన్‌తో మాట్లాడ‌నున్న‌ట్లు చెప్పారు. పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌త వారం శాంతి ఒప్పందం కోసం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. భూభాగం అప్ప‌గింత గురించి మాట్లాడుతామ‌న్నారు. ప‌వ‌ర్ ప్లాంట్ల గురించి కూడా చ‌ర్చిస్తామ‌న్నారు.

రేపు పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడనున్న ట్రంప్?

ఉక్రెయిన్‌తో కాల్పుల విర‌మ‌ణ
ఉక్రెయిన్‌తో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాటించేందుకు పుతిన్‌, ట్రంప్ మాట్లాడుకోనున్న‌ట్లు కొన్ని రోజుల క్రితం అమెరికా దౌత్య‌వేత్త స్టీవ్ విట్‌కాఫ్ తెలిపారు. ఇటీవ‌ల మాస్కోలో పుతిన్‌తో విట్‌కాఫ్ భేటీ అయ్యారు. ఆ చ‌ర్చ‌లు పాజిటివ్‌గా ముగిసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ర‌ష్యా, ఉక్రెయిన్ వ‌ర్గాలు.. చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు స‌ముఖంగా ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇటీవ‌ల అమెరికా నేతృత్వంలో జెడ్డాలో జ‌రిగిన భేటీలో ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించింది. అయితే ఆ ప్ర‌తిపాద‌న‌కు రష్యా కూడా అనుకూలంగా ఉన్న‌ది. కానీ కొన్ని ష‌ర‌తులు విధించ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ట్రంప్‌, పుతిన్ ఫోన్ చ‌ర్చ‌లు కీల‌కం కానున్నాయి.

Related Posts
లోకేశ్.. నీ మీద ఫిర్యాదు ఉంది – ప్రధాని మోడీ
modi lokesh

విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌తో సరదాగా సంభాషించిన సందర్భం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదిక వద్ద మోదీని ఆహ్వానించేందుకు Read more

కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతాం- ఎమ్మెల్సీ కవిత
kavitha demand

లక్కినేని సుధీర్‌ను పరామర్శించిన కవిత తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నేతలు నిరంతరం పోరాటం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి, Read more

ఏపీలో కొత్తగా మరో 4 లైన్ల రహదారి
4line highway line Ap

తిరుమల వెళ్లే వారికీ గుడ్ న్యూస్ తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేలాదిగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. Read more

మూసీ కూల్చివేతల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే – ఈటెల
etela musi

తెలంగాణలో మూసీ కూల్చివేతల అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *