हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Vadodara :నేను తాగలేదు గుంతలే ప్రమాదానికి కారణం..వడోదర నిందితుడి వ్యాఖ్యలు

Vanipushpa
Vadodara :నేను తాగలేదు గుంతలే ప్రమాదానికి కారణం..వడోదర నిందితుడి వ్యాఖ్యలు

గుజరాత్‌లోని వడోదరలో కారు బీభత్సానికి ఒక మహిళ మృతి చెందగా.. 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ ప్రమాదం తర్వాత నిందితుడు రక్షిత్ చౌరాసియా.. నడిరోడ్డుపై చేసిన హల్‌చల్ అంతా అక్కడ ఉన్న స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం రాత్రి అతివేగంగా కారును నడిపిన రక్షిత్ చౌరాసియా ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు పక్కన ఉన్న 8 మంది గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదం తర్వాత.. కారులో నుంచి బయటికి వచ్చిన రక్షిత్.. “అనదర్ రౌండ్, అనదర్ రౌండ్”.. “నిఖిత, నిఖిత”.. “ఓం నమః శివాయ, ఓం నమః శివాయ” అంటూ గట్టిగా అరుపులు అరిచాడు.

నేను తాగలేదు గుంతలే ప్రమాదానికి కారణం..వడోదర నిందితుడి వ్యాఖ్యలు

పోలీసుల అరెస్ట్, విచారణ
ఈ క్రమంలోనే రక్షిత్ చౌరాసియాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. అయితే తాను మద్యం సేవించి వాహనం నడపలేదని పేర్కొన్నాడు. రోడ్డుపై ఉన్న గుంత కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని వివరించాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా శనివారం మీడియాతో మాట్లాడిన రక్షిత్‌ చౌరాసియా.. గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు.. ఆ స్కూటీ కంటే ముందు వెళ్తోందని తెలిపాడు. ఇంతలోనే తాను కుడివైపు వెళ్తలేందుకు ప్రయత్నించగా.. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉందని వెల్లడించాడు. కారు టైరు గుంతలో పడటంతో అదుపుతప్పి.. పక్కనే ఉన్న స్కూటీని ఢీకొన్నట్లు పేర్కొన్నాడు.
గంటకు 50 కిలోమీటర్ల స్పీడు వెళుతున్న కారు
అదే సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోవడంతో తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 50 కిలోమీటర్ల స్పీడుతోనే వెళ్తోందని వివరించాడు. తాను ఆ సమయంలో మద్యం సేవించి లేనని.. హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నట్లు రక్షిత్‌ చౌరాసియా తెలిపాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870