దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రపంచ మార్కెట్లను భయాలు వెంటాడుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయి 73,828కి పడిపోయింది. నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 22,397 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.62%), ఎన్టీపీసీ (0.48%), సన్ ఫార్మా (0.45%), టాటా స్టీల్ (0.37%).
టాప్ లూజర్స్:
జొమాటో (-1.97%), టాటా మోటార్స్ (-1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.84%), ఏషియన్ పెయింట్ (-0.98%), బజాజ్ ఫైనాన్స్ (-0.94%).