నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్

నకిలీ సర్టిఫికెట్ తో కోర్ట్ ను మోసగించిన అనిల్‌కుమార్

చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్ హైకోర్టును తప్పుదోవ పట్టించిన విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి మధ్యంతర బెయిలు పొందిన విషయం తాజాగా బయటపడింది.

మధ్యంతర బెయిలు

అనంతపురంలో నమోదైన కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ.. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసేందుకు మధ్యంతర బెయిలు ఇవ్వాలని కోరుతూ గత నెల 14న హైకోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు దీనిని పరిగణలోకి తీసుకుని, ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ గడువు ముగిసిన తర్వాత 28న సాయంత్రం అతడు తిరిగి లొంగిపోయాడు.మార్చి 1న బోరుగడ్డ హైకోర్టులో మరో పిటిషన్ వేస్తూ మధ్యంతర బెయిలును పొడిగించాలని అభ్యర్థించాడు. తల్లికి తాను ఒక్కడినే కుమారుడినని, ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, మరో రెండు వారాల పాటు చికిత్స అవసరమని పేర్కొన్నాడు. గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ ఇచ్చినట్టుగా ఒక మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాడు.

మెడికల్ సర్టిఫికెట్

పోలీసుల తరపున వాదనలు వినిపించిన ఏపీపీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ వాస్తవమా కాదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. తప్పుడు ధ్రువీకరణ పత్రం అయితే చర్యలు తప్పవని హెచ్చరించుతూ, మార్చి 11 వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

FVK 18c2f32d70 v jpg

పోలీసుల విచారణ

పోలీసుల విచారణలో బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని తేలింది. పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందడం నిజమే అయినా, ఆమె ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయినట్టు గుర్తించారు. దీంతో లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించగా, వారు అలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని, పద్మావతి తమ వద్ద చికిత్స పొందలేదని తెలిపారు. ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ కూడా తాము అలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

న్యాయస్థానం

తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన అనిల్ వ్యవహారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయనపై మరో కేసు నమోదు చేయాలని యోచిస్తున్నారు. కాగా, తప్పుడు సర్టిఫికెట్‌తో కోర్టును మోసగించిన బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నాడు? ఏం చేస్తున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Posts
కిరణ్ రాయల్ కి క్లీన్ చిట్
కిరణ్ రాయల్‌ కి క్లీన్ చిట్ – మళ్లీ దూసుకెళ్లనున్న జనసేన నేత

తిరుపతి జనసేన ఇన్చార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్ తాను ఎదుర్కొన్న ఆరోపణల నుంచి పూర్తిగా బయటపడ్డారు. జనసేన పార్టీ తాత్కాలికంగా అతన్ని పక్కన పెట్టినప్పటికీ, తాజా పరిణామాలు Read more

ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు
nelluru eluru

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలక మండలుల్లో టీడీపీకి మరిన్ని విజయాలు లభించాయి. నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమె 41 Read more

వాట్సప్‌ ద్వారానే పౌర సేవలు..మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం
Civil services through WhatsApp.Meta Agreement between AP Govt

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్‌, నటాషా, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌, ఐఏఎస్‌ అధికారి, ఏపీ ఐటీ, విద్యాశాఖ Read more

నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట: టీటీడీ చైర్మన్‌
ttd

టీటీడీలో జరిగిన ప్రాణనష్టంతో భక్తుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. దీనితో నష్ట నివారణచర్యలకు టీటీడీ అధికారులు దిగారు. డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని Read more