ప్రముఖ గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలో ఉండగా, హైదరాబాదులోని KPHB హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన గాయని కల్పనకు ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్రముఖ సింగర్ల పరామర్శ
కల్పనను పరామర్శించేందుకు సినీ సంగీత ప్రపంచానికి చెందిన ప్రముఖులు ఆసుపత్రికి తరలి వచ్చారు. గాయని సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తి కనబరిచారు.
కల్పన భర్త ప్రసాద్‌పై విచారణ
కల్పన భర్త ప్రసాద్ చెన్నైలో ఉంటుండగా, ఆమె హైదరాబాద్‌లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మొదటగా కల్పన భర్త ప్రసాద్‌కు సమాచారం ఇచ్చి, తరువాత పోలీసులకు సమాచారం అందించడంతో కల్పన అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు.
నిద్రమాత్రల మోతాదు అధికం
కల్పన అధిక సంఖ్యలో నిద్రమాత్రలు మింగినట్లు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తిగత సమస్యల కారణమా?
కల్పన భర్త చెన్నైలో ఉండగా, ఆమె హైదరాబాద్‌లో ఒంటరిగా ఎందుకు?
రెండు రోజులుగా భర్త ఆమెను సంప్రదించలేదా?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.