हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ప్రజల వద్ద 2 వేలు కరెన్సీ నోట్లు:ఆర్బీఐ

Anusha
ప్రజల వద్ద 2 వేలు కరెన్సీ నోట్లు:ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, కొత్తగా రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే, కొన్నేళ్లకే ఈ నోటును చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, మార్కెట్లో ఇంకా రూ.2 వేల నోట్లు ఉండటాన్ని ఆర్బీఐ గుర్తించింది.

98% నోట్లు

ఆర్బీఐ ప్రకారం, చలామణిలో ఉన్న మొత్తం రూ.2 వేల నోట్లలో 98.18% బ్యాంకుల్లో తిరిగి జమయ్యాయి. అంటే, ప్రజలు, వ్యాపార సంస్థలు, బిజినెస్ సెటప్‌లు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకులకు ఇచ్చేశాయి. అయితే, ఇప్పటికీ ప్రజల వద్ద రూ.6,471 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మిగిలి ఉన్నాయని నివేదిక పేర్కొంది.

మార్పిడి ముగింపు

2023 అక్టోబర్ 7వ తేదీతో రూ.2 వేల నోట్లను బ్యాంకుల ద్వారా మార్పిడి చేసే అవకాశం ముగిసింది. దీని తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించారు.బ్యాంకుల ద్వారా మార్పిడి పూర్తిగా ముగిసినప్పటికీ, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల (రీజినల్ ఆఫీస్ ల) వద్ద రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆర్‌బీఐ కార్యాలయాల వద్దకు రావడం సాధ్యం కానందున, పోస్టల్ సేవల ద్వారా కూడా నోట్లను పంపి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

100438973

కేంద్ర ప్రభుత్వం

రూ. 500, రూ. 1000 నోట్లను 2016 నవంబరు నెలలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో 2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే రూ. 2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ 2023 మే 19న మొదటిసారి ప్రకటించింది. అప్పటికి సర్క్యులేషన్ లో ఉన్న 2 వేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. ఆర్బీఐ ప్రకటనతో జనం తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను ఎక్స్ చేంజ్ చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ. 2 వేల నోట్లు దాదాపు 98.18% వెనక్కి వచ్చాయి. రూ.2,000 నోట్లు వెనక్కు తిరిగి తీసుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మరో కీలక ప్రకటన చేసింది. ఇంకా మార్కెట్ లో సుమారు రూ.6, 471కోట్లు వినియోగంలో ఉన్నాయని సమాచారం. వీటిని కూడా వెనక్కు రప్పించేందుకు మరో అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికీ రెండు వేల నోట్లు కలిగిన వారు ఆర్ బిఐ ఆఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ప్రకటించింది. అంతే కాకుండా పోస్టాఫీసుల ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు పంపి కూడా మార్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా 19 చోట్ల ఆర్బీఐ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. వీటిల్లో 2 వేల రూపాయల నోట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ సహా దేశం మొత్తం మీద 19 ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లో వీటిని అప్పగించొచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870