మార్కెట్లోకి ఎంజీ కామెట్ కారు కొత్త వెర్షన్

మార్కెట్లోకి ఎంజీ కామెట్ కారు కొత్త వెర్షన్

అనేక దేశాల మాదిరే భారత్ కూడా విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు ఈవీ మోడళ్లు తీసుకువచ్చాయి. అంతర్జాతీయ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ కూడా కామెట్ పేరుతో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఇది చూడడానికి చిన్నదిగా కనిపించినా, ఫీచర్ల పరంగా ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇస్తుంది.
డిఫరెంట్ గా బ్లాక్ కలర్
తాజాగా ఎంజీ ఇండియా తన కామెట్ మోడల్ కు బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ను తీసుకువచ్చింది. ఇది బ్లాక్ కలర్ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎంజీ కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.8 లక్షలు. బ్యాటరీ ధర అదనం. ప్రీ బుకింగ్ సమయంలో ముందుగా రూ.11 వేలు టోకెన్ అమౌంట్ గా చెల్లించాలి. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే… ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో బ్యాటరీని 7.4 కిలోవాట్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే 3.5 గంటల్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. దీంట్లోని మోటార్ 110 ఎన్ఎం టార్క్ తో 41 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మార్కెట్లోకి ఎంజీ కామెట్ కారు కొత్త వెర్షన్

కామెట్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, కీ లెస్ ఎంట్రీ, ఫుల్ బ్లాక్ ఇంటీరియర్స్ విత్ రెడ్ హైలైట్, ఫోల్డబుల్ వ్యూయింగ్ మిర్రర్స్, మాన్యువల్ ఏసీ/హీటింగ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో ఇది టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు పోటీగా భావిస్తున్నారు.

Related Posts
హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు — రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
hostel

*హాస్టళ్లలోకి బయట ఆహారం రానివ్వొద్దు -- రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రాంపురం గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరా డిశ్చార్జి చేసినా హాస్టల్ Read more

పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి
పని గంటల పెంపుపై కేంద్రం స్పష్టమైన వైఖరి

పని గంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఇటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో Read more

కారులో వెళ్తున్న దుండగులను కాల్చిన పోలీసులు-ఇదిగో వీడియో
police

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో పారిపోతున్న దుండగులను పోలీసులు ఛేజ్‌ చేసి కాల్చిచంపారు.వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్‌ ముస్తఫా కగ్గా ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నట్లు మంగళవారం Read more

ఈ దశాబ్దం గ్లోబల్ టాలెంట్ మొబిలిటీలో అగ్రగామిగా భారతదేశం
With 7% growth in employability, India to emerge as global powerhouse for skilled talent by 2030

వీబాక్స్ ఈటీఎస్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025, CII, Taggd, AICTE మరియు AIU భాగస్వామ్యంతో , "గ్లోబల్ టాలెంట్ మొబిలిటీ" కోసం ఒక వ్యూహాత్మక లక్ష్యంను Read more