kannappa teaser

‘కన్నప్ప’ టీజర్ వచ్చేస్తుంది

మంచు విష్ణు హీరోగా .. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫస్ట్ లుక్ టీజర్ ను మార్చి 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు.

Advertisements
kannappa pic

మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో టైటిల్ రోల్‌లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, కాజల్, అగర్వాల్, మోహన్ లాల్, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, హీరోల ఫస్ట్ లుక్స్, తొలి గ్లింప్స్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా’ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

శివ శివ శంకరా 8 కోట్ల వ్యూస్..

‘శివ శివ శంకరా.. సాంబ శివ శంకరా.. హర హర శంకరా.. నీలగంధరా..’ అంటూ సాగే లిరిక్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ పాటను 8 కోట్ల మంది వీక్షించారు. అటు, సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇన్ స్టాగ్రాంలో 2 లక్షలకు పైగా రీల్స్ చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వర్గాల ఆడియన్స్‌ను సాంగ్ మైమరపించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ పాట మరింత ట్రెండ్ అవుతోంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా విజయ్ ప్రకాష్ ఆలపించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Related Posts
ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన
Health Minister Damodara Rajanarsimha

హైదరాబాద్‌: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మొబైల్ స్క్రీనింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే, Read more

తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు
tirumala

తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తిరుపతికి చెందిన భక్తులు తమ అభిమాన దేవుడికి విరాళాలు అందజేశారు. భీమవరంకు చెందిన వెంకటరమణ భక్తుడు రూ. Read more

హరియాణా ఫలితాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
Congress complains to EC on

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద Read more

ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi met MPs

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న Read more

×