ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. రేపు (ఆదివారం) జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలపై అభ్యర్థులు దృష్టి పెట్టవద్దని, ఎగ్జామ్ వాయిదా అనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది.గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటనలు మాత్రమే నమ్మాలని కమిషన్ సూచించింది. ఈ పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేసింది.
పరీక్షల సమయం
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నాయి.
మొదటి పత్రం (పేపర్-1): ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
రెండో పత్రం (పేపర్-2): మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలకు కనీసం 15 నిమిషాల ముందుగా చేరుకోవాలని ఏపీపీఎస్‌సీ సూచించింది. పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం, అనుసరించాల్సిన నిబంధనల గురించి అభ్యర్థులు ముందుగానే తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు
హాల్ టికెట్ తప్పనిసరి: పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు హాల్‌టికెట్ మరియు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి.
పరీక్షా కేంద్రానికి ఆలస్యం చేయొద్దు: పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు చేరుకోవాలి.
మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు నో ఎంట్రీ: పరీక్షా కేంద్రంలో ఎలాంటి గ్యాజెట్లను అనుమతించరు.
సాంప్రదాయ దుస్తులు ధరించండి: పరీక్ష కేంద్రానికి అనుకూలమైన దుస్తులు ధరించాలి.
పరీక్షా నిబంధనలు పాటించాలి: ఏదైనా అనుచిత ప్రవర్తన కనుగొనబడితే, అభ్యర్థిత్వం రద్దు చేసే అవకాశముంది.
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
ఇటీవల కొన్ని సోషల్ మీడియా వేదికల ద్వారా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయబడినట్లు తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై ఏపీపీఎస్‌సీ స్పష్టత ఇస్తూ, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఖండించింది. అసత్య ప్రచారాలను నమ్మి అభ్యర్థులు గందరగోళానికి గురికావద్దని సూచించింది.
మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వస్తున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్ 1 రాత పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్‌కు అభ్యర్థులు ఉదయం.9.30 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9.45 గంటలకు గేట్లను మూసివేస్తారు. అలాగే మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల్లోగా పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన ఎవ్వరినీ లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు.