ఇక ఉచిత యూపీఐ గూగుల్ పే

ఇక యూపీఐ గూగుల్ పే చెల్లింపులపై రుసుము!

భారతదేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం చేరుకుంది. దీనికి కారణంగా ప్రధాని మోదీ డీమానిడైజేషన్ ప్రక్రియను ప్రకటించిన సమయంలో పేమెంట్ యాప్స్ సామాన్యులకు సైతం దగ్గరయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లింపులు చేసుకునేందుకు భారతదేశంలోని యూపీఐ చెల్లింపు విధానం ప్రజలకు అవకాశం కల్పిస్తున్న వేళ ప్రజలు భౌతికంగా డబ్బును వినియోగించటానికి దూరంగా జరుగుతున్నారు. పైగా జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు దానికి ముందు తెరవటం కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు అంత్యంత చేరువగా మార్చేసింది. ఈ క్రమంలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, నావీపే, క్రెడ్ వంటి అనేక యాప్స్ ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. ప్రజలు ఎలాంటి అదనపు ట్రాన్సాక్షన్ రుసుములు లేకపోవటం వల్లనే ప్రస్తుతం ఈ యాప్స్ విరివిగా వినియోగిస్తున్నారు.

Advertisements
ఇక ఉచిత యూపీఐ గూగుల్ పే


జీఎస్టీ విధించాలని నిర్ణయం
ప్రస్తుతం అమెరికా టెక్ దిగ్గజం భారతదేశంలో కొనసాగిస్తున్న గూగుల్ పే వ్యవస్థ ఇకపై ప్రజల నుంచి చెల్లింపులకు ట్రాన్సాక్షన్ రుసుమును వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్రెడిట్, డెబిట్ కార్డులతో చేసే బిల్ చెల్లింపులకు గూగుల్ పే కన్వేయన్స్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించటంతో చాలా మంది వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో గూగుల్ సంస్థ లావాదేవీ విలువలో 0.5% నుంచి 1% వరకు రుసుముతో పాటు దానిపై జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. దేశంలో యూపీఐ చెల్లింపుల వినియోగం పెరుగుతున్న వేళ దీనికి అవుతున్న ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేయటానికి UPI లావాదేవీలను మానిటైజ్ చేయడం వైపు టెక్ దిగ్గజం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్యాష్ బ్యాక్స్ ఆఫర్
ఇప్పటికే ప్రముఖ డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్ పే కూడా వాటర్ బిల్, కరెంట్ బిల్, ఇంటర్నెట్ బిల్, స్కూల్ ఫీజులు, డీటీహెచ్ రీఛార్జ్, మెుబైల్ ఫోన్ రీఛార్జ్ వంటి యుటిలిటీ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లో చాలా డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ ఫారమ్ లు క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపులకు చాలా మంచి క్యాష్ బ్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో విజయవంతం అయిన యూపీఐ చెల్లింపు వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది. దీనిని దేశంలో వీధి చివరి చిన్న వ్యాపారుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అందరూ వినియోగించటంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపుల్లో భారత్ తర్వాత బ్రెజిల్, చైనా, థాయిలాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు కొనసాగుతున్నాయి.

Related Posts
ప్రియాంక గాంధీ వాయనాడ్ లో 3.6 లక్షల ఓట్ల ఆధిక్యం
PRIYANKA GANDHI scaled

2024 లోక్‌సభ బైపోల్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో విశేష ఆధిక్యం సాధించారు. ప్రస్తుత ట్రెండ్‌ల ప్రకారం, ప్రియాంక గాంధీ 3.6 లక్షల ఓట్ల ఆధిక్యంతో Read more

Waqf Amendment Bill : వక్స్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం – కిషన్ రెడ్డి
Waqf Bill వక్ఫ్ బిల్లుపై చర్చ ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే

వక్స్ (Waqf) సవరణ బిల్లు 2024 లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లుతో వక్స్ సంస్థలలో Read more

Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఖరారు
Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఖరారు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌షా Read more

IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని పాయింట్లు అవసరమో తెలుసా?
IPL 2025: ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని పాయింట్లు అవసరమో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో 23 మ్యాచ్ ల తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో Read more

×