हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం

Vanipushpa
హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని రూల్స్ మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్.. మరింత కఠినం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వీసాలకు సంబంధించి డ్రాప్ బాక్స్ రూల్స్‌ను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించకపోయినప్పటికీ.. వీసా అప్లికేషన్ సెంటర్‌లలో కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకువచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటినుంచి హెచ్‌-1బీ, టూరిస్ట్ వీసాలు కలిగి ఉన్నవారు తమ వీసాలను రెన్యువల్‌ చేసుకునేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం


డ్రాప్‌బాక్స్‌ నిబంధనలను కఠినతరం
వీసాల పునరుద్ధరణ కోసం అమెరికా తీసుకువచ్చిన డ్రాప్‌బాక్స్‌ నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల వరకు ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు దాన్ని 12 నెలలకు తగ్గించారు. అంటే హెచ్ 1బీ, టూరిస్ట్ వీసా గడువు ముగిసిన వారు 12 నెలల లోపు రెన్యువల్ చేయించుకోకపోతే.. ఆ తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు దాటి 48 నెలలలోపు మళ్లీ రెన్యువల్‌ చేసుకునేందుకు డ్రాప్‌బాక్స్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలు ఉండేది. వారికి ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించేవారు కాదు. తాజా నిబంధనలతో వీసా గడువు ముగిసి 12 నెలల్లోపు వారికి మాత్రమే డ్రాప్‌బాక్స్‌ పద్దతిలో రెన్యువల్‌ చేసుకునే అనుమతి ఇచ్చారు.
కొత్త నిబంధనలు
అధికారికంగా ఈ నిబంధనలను వెల్లడించకపోయినా.. వెంటనే వీటిని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీసా రెన్యూవల్‌కు సంబంధించిన కొత్త నిబంధనలను ఇప్పటికే వీసా అప్లికేషన్‌ కేంద్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తీసుకువచ్చిన రూల్స్‌తో హెచ్‌-1బీ వీసాలతోపాటు బీ1, బీ2 వంటి నాన్‌ఇమిగ్రెంట్‌ వీసాదారుల అప్లికేషన్లపైనా తీవ్ర ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వీసాదారులు తమ వీసాలను రెన్యువల్‌ చేసుకోవడానికి ఇప్పుడు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మళ్లీ పాత పద్ధతిలోనే వీసా రెన్యూవల్
నిజానికి కరోనా మహమ్మారి వెలుగుచూడక ముందు ఈ 12 నెలల నిబంధన ఉండేది. కరోనా తర్వాత వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో అప్పటి జో బైడెన్ సర్కార్ ఈ డ్రాప్‌బాక్స్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్‌.. మళ్లీ పాత పద్ధతిలోనే వీసా రెన్యూవల్ చేయాలని నిర్ణయించారు.
అపాయింట్‌మెంట్ల కోసం నిరీక్షణ
ఈ నిర్ణయంతో భారతీయులపైనే అధిక ప్రభావం పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ, టూరిస్ట్ వీసాలు కలిగిన భారతీయులు.. వాటిని రెన్యువల్‌ చేసుకోవడం మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో బీ1, బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ల కోసం 440 రోజులకు పైగా వేచిచూస్తున్నారు. తాజా నిర్ణయంతో అది మరింత ఎక్కువ కానుందనే భయాలు నెలకొన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం

ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం

IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ? జాబితా బయట!”

IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ? జాబితా బయట!”

పాకిస్థాన్‌లో సంస్కృత కోర్సు ప్రారంభం

పాకిస్థాన్‌లో సంస్కృత కోర్సు ప్రారంభం

నోబెల్‌ విజేత నర్గెస్‌ మొహమ్మది అరెస్టు

నోబెల్‌ విజేత నర్గెస్‌ మొహమ్మది అరెస్టు

పంచదేశాల కూటమి వైపు ట్రంప్ అడుగులు?

పంచదేశాల కూటమి వైపు ట్రంప్ అడుగులు?

కెనడాలో ట్రక్ డ్రైవర్‌ల కాల్పు: ముగ్గురు భారతీయులు అరెస్ట్

కెనడాలో ట్రక్ డ్రైవర్‌ల కాల్పు: ముగ్గురు భారతీయులు అరెస్ట్

ఒమన్ గల్ఫ్‌లో చమురు నౌకను ఇరాన్ స్వాధీనం

ఒమన్ గల్ఫ్‌లో చమురు నౌకను ఇరాన్ స్వాధీనం

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం

భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం

పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన

పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

📢 For Advertisement Booking: 98481 12870