బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ

బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ

ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 31 మార్చి 2024న బ్రాంచులు తెరిచి ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి రోజు 31 మార్చి ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్) ప్రభుత్వ హాలిడే కూడా మార్చ్ 31 ఆదివారం రానుంది. ఆదివారం బ్యాంకులు తెరిచి ఉండాలని ఆర్‌బిఐ ఎందుకు కోరింది ? ప్రతి నెల అన్ని ఆదివారాలు, 2వ ఇంకా 4వ శనివారాల్లో బ్యాంకులు సాధారణంగా మూసివేస్తుంది. అయితే RBI ఒక ప్రకటనలో “2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని చెల్లింపులకు సంబంధించిన పూర్తి లావాదేవీలను లెక్కించడానికి లావాదేవీలతో వ్యవహరించే అన్ని బ్యాంకుల అన్ని శాఖలను 31 మార్చి 2024 (ఆదివారం) నాడు తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం కోరింది” అని పేర్కొంది.

బ్యాంకులకు ఆదివారం సెలవు లేదు: ఆర్బీఐ

బ్యాంకులు ప్రజలకు తగిన సమాచారం ఇవ్వాలి
దీని ప్రకారం, ఏజెన్సీ బ్యాంకులు ప్రభుత్వ వ్యాపారాలతో వ్యవహరించే అన్ని శాఖలను 31 మార్చి 2024 (ఆదివారం) న తెరిచి ఉంచాలని సూచించింది. పైన పేర్కొన్న బ్యాంకింగ్ సేవలపై బ్యాంకులు ప్రజలకు తగిన సమాచారం ఇవ్వాలని RBI పేర్కొంది. ఏజెన్సీ బ్యాంకులు అంటే ఏమిటి? ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరించడానికి అలాగే ప్రభుత్వం తరపున వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారం ఇచ్చిన వాణిజ్య బ్యాంకులను ఏజెన్సీ బ్యాంకులు అంటారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు, సేవలను సులభం చేయడంలో ఈ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే కొన్ని ముఖ్యమైన పనుల్లో పన్నుల వసూలు, ప్రభుత్వ చెల్లింపులు ఉంటాయి.

ఏజెన్సీ బ్యాంకుల లిస్ట్

షెడ్యూల్డ్ ప్రభుత్వ రంగ బ్యాంకులు (విలీనం తర్వాత) బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షెడ్యూల్డ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, DCB బ్యాంక్ లిమిటెడ్, ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్, HDFC బ్యాంక్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, IDBI బ్యాంక్ లిమిటెడ్, IDFC FIRST బ్యాంక్ లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్, కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, RBL బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, యెస్ బ్యాంక్ లిమిటెడ్, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, CSB బ్యాంక్ లిమిటెడ్, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్

Related Posts
RBI: రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు
రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

చిన్న రుణ మొత్తాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయాలను తీసుకుంది. 50,000 రూపాయల వరకు ఉండే చిన్న రుణ మొత్తాలపై అధిక ఛార్జీలను విధించకూడదని Read more

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం – రేఖా గుప్తా కీలక నిర్ణయాలు
ప్రమాణ స్వీకార అనంతరం రేఖా గుప్తా తన మొదటి ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రకటించారు.

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం – పాలన ఎలా ఉండబోతోంది? ఢిల్లీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా Read more

Lion : జూలో మగ సింహం ‘వీరా’ మృతి
Lion జూలో మగ సింహం ‘వీరా’ మృతి

Lion : జూలో మగ సింహం ‘వీరా’ మృతి చెన్నై వండలూరు అరింజర్‌ అన్నా జంతు ప్రదర్శనశాలలో మగ సింహం ‘వీరా’ మృతిచెంది బాధాకర సంఘటన చోటుచేసుకుంది. Read more

ప్రేమ కోసం జైలు పాలు అయిన ప్రేమికుడు
man in jail2

ప్రేమకు సరిహద్దులు వుండవని అంటారు. దేశం, కులం, మతం వీటికి అతీతమైనదే ప్రేమ. దీనిని నిరూపించాలి అనుకున్నాడు ఓ ప్రేమికుడు. ఆ ప్రయత్నంలో పోలీసులకు చిక్కాడు ఓ Read more