ఏలూరులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

ఏలూరులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. కోళ్ల ఫారం సమీపంలో ఉన్న ఈ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపగా అతడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు.

Advertisements
birdflu khTH 621x414@LiveMint

ప్రజలకు సురక్షితమైన సూచనలు:
వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బర్డ్ ఫ్లూ గురించి ప్రజలకు స్పష్టం చేస్తూ, ఉడికించిన గుడ్లు మరియు కోడి మాంసం తినడం సురక్షితమని ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోయాయని అక్కడ శాంపిల్స్ తీసి భోపాల్‌ పంపగా బర్డ్‌ఫ్లూ అని తేలిందన్నారు. అక్కడ మిగిలిన కోళ్లు, గుడ్లను పూడ్చివేశామని దీనిపై ఆందోళన వద్దన్నారు.

ప్రభావిత ప్రాంతాలు:
ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 50 లక్షల పైచిలుకు కోళ్లు ఈ వైరస్ తో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. వేల్పూరు ప్రాంతంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకడంతో ఒక కిలోమీటరు పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించి చర్యలు చేపట్టారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతాల్లో కోళ్ల తరలింపు, ఉత్పత్తి రవాణా పరిమితులు ఉన్నాయన్నారు.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణ:
ఆ ప్రాంతంలో స్పెషల్ టీమ్‌లు ఏర్పాటవగా, సర్వెలెన్స్ కార్యాచరణ కొనసాగుతున్నది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వలస పక్షులు సంచరించే చెరువులు, కొల్లేరు పరీవాహక ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా ర్యాపిడ్‌ టీంలు రంగంలోకి దిగాయన్నారు. పశుసంవర్ధకశాఖ అధికారులు 9966779943 నంబరుతో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనిపై ఆందోళన వద్దన్నారు.

Related Posts
Visakhapatnam : విశాఖ నుంచి 42 వేసవి ప్రత్యేక రైళ్లు !
42 summer special trains from Visakhapatnam !

Visakhapatnam : వేసవి సెలవులు మొదలు కానున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు ఇక బ్రేక్ పడనుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ పరీక్షల మూడ్ నుంచి ఎంజాయ్ మూడ్‌లోకి Read more

Posani Krishna Murali: పోసానికి సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ
పోసానికి సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ

సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇటీవల అనేక చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేశ్ పై Read more

అక్టోబర్ 23 న వైఎస్సార్ జిల్లాల్లో జగన్ పర్యటన
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఈ నెల 23న గుంటూరు మరియు వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నట్లు వైసీపీ పార్టీ ప్రకటించింది. ఈ పర్యటనలో, ఆయన టీడీపీ Read more

ఉచిత బస్సు ప‌థ‌కంలో కీల‌క నిర్ణ‌యం!
ఉచిత బస్సు ప‌థ‌కంలో కీల‌క నిర్ణ‌యం!

ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్‌డీఏ కూట‌మి ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీలలో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణ ప‌థ‌కం ఒక‌టి. దాంతో ఈ స్కీమ్ అమ‌లు ఎప్పుడెప్పుడా Read more

×