సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు

సరదాగా స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు: వీడియో వైరల్

చాలా మంది పిల్లలు తల కిందులుగా దూకుతుంటారు. సరదాగా గంతులేస్తూ.. తలకిందులుగా దూకుతూ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సరదా స్టంట్ చేయబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

Advertisements

చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని కాపాడతాయి

‘మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సరదాగా స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. అతడి మెడ ఎముక విరిగిపోయింది. ఇలా చేయొద్దు. చిన్న జాగ్రత్తలు మీ జీవితాన్ని కాపాడతాయి’ అనే క్యాప్షన్‌తో బాబా బెనారస్ అనే యూజర్ ఎక్స్‌లో ఫిబ్రవరి 10న ఓ వీడియోను పోస్టు చేశారు.
యూజర్ పోస్టు చేసిన వీడియో నిజమేనా అని తెలుసుకోవడం కోసం సజగ్ టీమ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. కీ ఫ్రేమ్స్‌ను గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేయగా.. దీనికి సంబంధించిన వీడియోలు బయటకొచ్చాయి. అడ్మిన్ మీడియా అనే తమిళ బ్లాగ్‌లో రాసిన ఓ కథనం కనిపించింది.

సరదాగా స్టంట్లు
అలాగే దైనిక్ భాస్కర్ హిందీ న్యూస్ వెబ్‌సైట్లో రాసిన కథనం కూడా కనిపించింది. దైనిక్ భాస్కర్‌లో కనిపించిన వివరాల ప్రకారం 2024 డిసెంబర్ 13న ఈ ఘటన చోటు చేసుకుంది. వీధుల్లో దుప్పట్లు, బ్లాంకెట్లు అమ్ముకునే 18 ఏళ్ల యువకుడు మహారాష్ట్రలోని బేలాపూర్‌లో సరదాగా స్టంట్లు చేసే క్రమంలో చనిపోయాడని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఫ్రీ ప్రెస్ జర్నల్ వెబ్‌సైట్లో
సంబంధిత కీవర్డ్స్‌తో గూగుల్‌లో వెతకగా.. ఫ్రీ ప్రెస్ జర్నల్ వెబ్‌సైట్లో రాసిన కథనాన్ని సజగ్ టీమ్ గుర్తించింది. తలకిందులుగా దూకే ప్రయత్నంలో యువకుడి తల ముందుగా నేలను తాకడంతో.. అతడి మెడ విరిగిపోయిందని.. ఆరు రోజులపాటు హాస్పిటల్‌లో చికిత్స పొందిన యువకుడు మరణించాడని ఈ కథనంలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో బ్లాంకెట్స్ అమ్ముకుని జీవించే ఈ యువకుడు.. డిసెంబర్ 13వ తేదీన ఉదయం ఓ ఇంటి ముందు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో.. నేలపై పరిచిన బ్లాంకెట్స్ మీద సరదాగా స్టంట్స్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని ఈ కథనంలో వెల్లడించారు.

Related Posts
ఒడిస్సా స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లో మార్పు
ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక నిర్ణయం - విద్యార్థుల యూనిఫాంలకు కొత్త రంగులు

ఒడిశాలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం Read more

పార్లమెంటుపై దాడి : అమరులకు మోదీ, రాహుల్ నివాళి
Modi, Rahul Tribute to Mart

2001 డిసెంబర్ 13న దేశాన్ని దుఃఖంలో ముంచేసిన రోజు. ఈ రోజు భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు చేసిన దాడి దేశ చరిత్రలో మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ఐదుగురు Read more

Zomato: 500 మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన జొమాటో !
500 మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన జొమాటో

Zomato: కస్టమర్‌ సపోర్ట్‌ అసోసియేట్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న 500 మందికిపైగా ఉద్యోగుల్ని ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ఇంటికి పంపింది. నియామకం చేపట్టిన ఏడాదిలోపే తొలగింపులు Read more

కార్ల అమ్మకాలపై మహారాష్ట్ర సర్కార్‌ కొత్త రూల్‌
Maharashtra government new rule on car sales

ముంబయి: కరోనా తర్వాత చాలా మంది ద్విచక్ర వాహనాలపై తిరగడం తగ్గించారు. చాలా మంది ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రభుత్వ రవాణా Read more

×