రోజా విషయంలోజగన్ కీలక నిర్ణయం?

రోజా విషయంలో జగన్ కీలక నిర్ణయం?

నగరిలో రోజా కి షాక్ ఇవ్వబోతున్న జగన్. వైసీపీలో ఏదో జరుగుతోంది ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ అధినేతే కొందరికి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పుడిదే అంశంపై ఏపీ పాలిటిక్స్‌లో ముఖ్యంగా వైసీపీలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది ఇంతకీ జగన్ రెడ్డి పార్టీలో ఏం జరుగుతోంది. ఎవరిని పంపించేందుకు పొగ పెడుతున్నారు. ఎవరి రాక కోసం ఎవరిని బలి చేసే ప్రయత్నం జరుగుతోంది.

Advertisements
రోజా విషయంలో జగన్ కీలక నిర్ణయం?

జగన్ తీసుకున్న నిర్ణయానికి రాజకీయ సంబంధం:

వైసీపీ అధినేతే స్వయంగా కొందరిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారట. మాజీ మంత్రి రోజాను పార్టీ నుంచే సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. రోజా సేవలు ఇక చాలని బలమైన నాయకుడు అవసరమని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారట.

 ప్రజల అభిప్రాయం: జగన్ నిర్ణయంపై జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న పార్టీ నేతలు ఇవేం పనులు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

రాజకీయ ప్రాముఖ్యతలో నిస్సందేహమైన పాత్ర:రోజా
రాజకీయాలలో రోజా యొక్క ప్రాముఖ్యతను అంగీకరించకుండా జగన్ ఎలా దూరం పెట్టగలరు? ఆమె వైసీపీ కోసం చేసిన పనులు.

రాజకీయం లో మార్పులు:ఇందులో భాగంగానే గాలి ముద్దు కృష్ణమ నాయుడు రెండో కుమారుడిని వైసీపీలోకి చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు జగన్. యువ నాయకుడు గాలి జగదీష్ బుధవారం నాడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

పార్టీ కోసం కృషి చేసిన రోజా :

వాస్తవానికి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు రోజా వైసీపీ కోసం చాలా ఫైట్ చేశారు. ఆయన ప్రత్యర్థులు చేసిన కామెంట్స్, విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. మరి అలాంటి నాయకురాలిని జగన్ దూరం పెట్టాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. మరి నిజంగానే రోజాను పక్కనపెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎలాగైనా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాలి అన్న ఆకాంక్షతో ఉన్న గాలి జగదీష్ ప్రకాష్ ఈనెల 12వ తేదీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని తెలుస్తుంది. అదే జరిగితే నగరి వైఎస్సార్ సీపీలో లెక్కలు మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌పై గాలి జగదీష్ ప్రకాశ్‌కు వైఎస్ జగన్ హామీ ఇస్తే కనుక రోజా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మరి నగరి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Related Posts
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారి టికెట్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ Read more

పిల్లలకు సాయం చేస్తా అంటూ మంచు విష్ణు
పిల్లలకు సాయం చేస్తా అంటూ మంచు విష్ణు

టాలీవుడ్ కథానాయకుడు, మోహన్ బాబు విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల త్యాగాలను గౌరవించే క్రమంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ Read more

మహిళను ఏమార్చి నగల దోపిడీ
మహిళను ఏమార్చి నగల దోపిడీ

ప్రపంచవ్యాప్తంగా దొంగతనాలు రోజురోజుకి అధికంగా పెరిగిపోతున్నాయి. గతంలో ఒకే వ్యక్తి దొంగతనాలు చేసినప్పటికీ, ఇప్పుడిప్పుడు గ్రూపులుగా పనిచేసే దొంగల ముఠాలు మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నాయి. Read more

మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం.. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం.. మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

నారా లోకేశ్ ప్రారంభించిన ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, పర్యావరణ హితంగా మార్చేందుకు నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో Read more

×