ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్‌ ఛేంజర్ గా ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం

నిర్మలమ్మ మ్యాజిక్ తో ఎన్నికల్లో విజయం

ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్‌ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు. దశాబ్ధకాలంగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ బీజేపీకి ఇన్నాళ్లుగా ఒక లోటును చూసింది. అదే దేశ రాజధాని దిల్లీ గడ్డమీద తన పెత్తనం చెలామణి కుదరకపోవటం. కేజ్రీవాల్ ఇన్నాళ్లుగా కొరకరాని కొయ్యగా మారటంతో బీజేపీ సమయం కోసం ఎదురుచూసింది. ప్రస్తుతం 27 ఏళ్ల తర్వాత దిల్లీలో గెలుపు మోదీ సర్కారు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా బలపరుస్తోంది.

niramala

అయితే దిల్లీలో అధికారం దక్కించుకోవటానికి బీజేపీకి ఎలాంటి అంశాలు కలిసివచ్చాయనే చర్చ ఇప్పుడు ముమ్మరంగా సాగుతోంది. ప్రధానంగా దిల్లీలోని మధ్యతరగతి ప్రజలు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన రూ.12 లక్షల ఆదాయపన్ను పరిమితి పెంపుపై సంతృప్తిని పొందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గతంలో బీజేపీ తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ ముస్లిం ఓటర్లను బీజేపీ వైపు తిప్పిందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈసారి బడ్జెట్లో కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు పెంపుతో పెద్ద ఉపశమనాన్ని ఇవ్వటం వారి కొనుగోలు శక్తిని పెంచుతుందని ప్రజలు భావించారు. దీని ప్రభావం 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక విభాగం ఓటింగ్ ప్రాధాన్యతలను కూడా ప్రభావం చూపిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఓట్ల రూపంలో బీజేపీకి దేశరాజధానిలో విజయం అందించిందని వారు చెబుతున్నారు. బడ్జెట్ తర్వాత బీజేపీ ‘మధ్యతరగతి-స్నేహపూర్వక’ బడ్జెట్ 2025ను ప్రశంసిస్తూ దిల్లీ ఎన్నికల గురించి వార్తాపత్రిక ప్రకటనను విడుదల చేయటం ఎన్నికల సరళిపై ప్రభావాన్ని చూపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2015-2020 మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ పేద, అల్పాదాయ, మధ్య-ఆదాయ ఓటర్ల అంతరాన్ని తగ్గించుకుంది. జీఎస్టీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు ఓకే చేస్తేనే ఈ రేట్లు పెరుగుతాయి. కానీ అవన్ని దాచిపెట్టి ప్రతి వస్తువు రేటు పెరగడం వెనక నిర్మలమ్మ హస్తమే ఉందనే ఆరోపణలు చేసారు. తగ్గిస్తే తమ ఘనతగా ఆయా రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఆప్ బీజేపీ కంటే 15 శాతం అధిక ఓట్లను కలిగి ఉండగా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా గిగ్ వర్కర్లకు ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం వంటివి ఢిల్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. అదే సందర్భంలో వాళ్ల జిఎస్టి తరహాలో వాళ్ల దగ్గర నుంచి ప్రతి లాభావాదేవి మీద కొంత శాతాన్ని మినయించి సామాజిక భద్రతనిధిలో జమ చేయించి ఆ నిధి నుంచి పింఛన్ చెల్లించే ఆలోచనకు చేయడం పెద్ద పరిణామం. మొత్తంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతితో పాటు ఉద్యోగులు మనసులు చూరగొనడం వల్లే ఢిల్లీ సింహాసనంపై బీజేపీ కాషాయ జెండా ఎగరేసింది.

Related Posts
Shashi Tharoor: మోడీపై ప్ర‌శంస‌లు కురిపించిన శ‌శి థ‌రూర్‌
మోడీపై ప్ర‌శంస‌లు కురిపించిన శ‌శి థ‌రూర్‌

ప్ర‌ధాని మోదీపై మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించారు కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్‌. కోవిడ్ స‌మ‌యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ దేశాల‌తో టీకా దౌత్యాన్ని నిర్వ‌హించిన Read more

నేతాజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి
నేతాజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి

భారత మాత గొప్ప కుమారుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆయనకు నివాళులు అర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఆయన Read more

Chhattisgarh : ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టుల మృతి!
Another shooting in Chhattisgarh leaves several dead

Chhattisgarh : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాల్పులతో దద్దరిల్లుతోంది. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు Read more

బొమ్మలతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే ఢిల్లీ
బొమ్మలతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే .ఢిల్లీ.

ఈ రోజు భారత రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్ అదో అద్భుతమైన దృశ్యంగా మారింది. ఈ పరేడ్ దేశం Read more