తెలంగాణ లో గేమ్ చంగెర్ మూవీ స్పెషల్ షో లను రద్దు చేస్తూ హోమ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు , ప్రత్యేక ప్రదర్శనల పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగించి . బెనిఫిట్ షోలను రాదు చేసి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. దీనిపై పునరాలోచించాలి అని చెపింది. దీనితో ఆ షోలను ప్రభుత్వం రద్దు చేసింది.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించిన జస్టిస్ రెడ్డి, చర్య తీసుకోవడంలో విఫలమైతే, ప్రత్యేక ప్రదర్శనలకు వ్యతిరేకంగా నిషేధ ఉత్తర్వులు జారీ చేయవలసి వస్తుందని చెప్పారు. మల్టీప్లెక్స్లకు 100 రూపాయలు, స్వతంత్ర థియేటర్లకు 50 రూపాయలు పెంచడంపై ఏ చట్టం ఆధారంగా చర్య తీసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
గేమ్ ఛేంజర్ కోసం జారీ చేసిన మెమోను సమీక్షించి, పునఃపరిశీలించాలని న్యాయమూర్తి హోమ్ శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ప్రయోజనం, ఆరోగ్యం, భద్రత పరిగణనలోకి తీసుకోకుండా భవిష్యత్తులో ప్రత్యేక ప్రదర్శనలను అనుమతించవద్దని ఆదేశించారు.
స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చేందుకు హోమ్ శాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ, సతీష్ కమల్, భరత్ రాజ్ అనే వారు వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ నిర్వహించారు. మెమో సినిమా రెగ్యులేషన్ యాక్ట్, రూల్స్, జీఓ 120ను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రత్యేక ప్రదర్శనలకు లేదా టికెట్ ధరల పెరుగుదలకు అనుమతి ఉండదని ప్రకటించారని పిటిషనర్లు తెలిపారు. ఈ హైకోర్ట్ దర్యాప్తు వల్ల గేమ్ ఛేంజర్ స్పెషల్ షోలను రద్దు చేసిన్నటు తెలుస్తోంది.