fire accident in madhapur

మాదాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఒక ఐటీ కంపెనీలో ఎగిసిపడిన మంటలు చుట్టుపక్కల వారిని షాక్ కు గురి చేశాయి. ఐటీ కారిడార్ కు గుండెకాయ లాంటి మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వా మల్టీస్టోరెడ్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి.

ఈ భారీ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్ష్యులు ఇస్తున్న ప్రాధమిక సమాచారం ప్రకారం సత్వా భవనంలో ఒక్కసారి మంటలు రేగటంతో భయాందోళనలకు గురైన ఉద్యోగులు పలువురు బయటకు పరుగులు తీసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు. అయితే.. భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్నంతనే అగ్నిమాపక శాఖ ఘటనాస్థలానికి చేరుకొని.. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటన్నరకు మంటలు అదుపులోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మున్సిపల్ తదితర శాఖలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. భారీగా మంటలుచెలరేగటంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఐటీ కారిడార్ లో కీలకమైన ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం కారణంగా పలు ఐటీ సంస్థలకు ఆపరేషన్ ఇబ్బందులు తలెత్తే వీలుందని చెబుతున్నారు. ఎందుకుంటే..సత్వా భవనంలో పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడా భవనంలో నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలు రోజువారీ కార్యకలాపాల్ని ఎలా చేపడతారన్నది ప్రశ్నగా మారింది. ఈ అగ్నిప్రమాదం కొత్త సందేహాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. భారీగా కట్టేసిన భవనాల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే.. వాటిని సమర్థంగా నిలువరించే వ్యవస్థ లేదన్న విమర్శ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bahas 2 agenda penting, pjs wali kota batam hadiri rapat paripurna dprd kota batam. Valley of dry bones. Lanka premier league archives | swiftsportx.