తెలంగాణలో వెటర్నరీ సైన్స్‌ అభివృద్ధికిపీపీఏటీతో చేతులు కలిపిన కార్నివెల్

Carnival joined hands with PPAT

పెంపుడు జంతువుల సంరక్షణలో ఆచరణాత్మక దృక్పథాలు, వినూత్నతలతో పశువైద్యులను శక్తివంతం చేయడం.. కుక్కల హీమోప్రొటోజోవా వ్యాధుల నిర్వహణపై నిపుణుల చర్చలు.. భారతదేశంలోనే మొట్టమొదటిదిగా ప్రీమియం లాంబ్ పెట్ ఫుడ్‌ను ఆవిష్కరించిన కార్నివెల్..

హైదరాబాద్: భారతదేశంలో పెంపుడు జంతువుల పెంపకంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రముఖ పెట్ ఫుడ్ బ్రాండ్ అయిన కార్నివెల్, పెట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (PPAT) సహకారంతో ప్రత్యేక వెటర్నరీ సినర్జీ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కుక్కల హీమోప్రొటోజోవాన్ వ్యాధులు, వినూత్న పెంపుడు జంతు వుల పోషణ అంశాలపై తెలంగాణకు చెందిన100 మంది వెటర్నరీ నిపుణులను ఒకచోట చేర్చి చర్చలు జరిపారు. దేశంలో పెంపుడు జంతువుల ఆరోగ్యం, సంక్షేమానికి వెటర్నరీ ప్రాక్టీషనర్లు వెన్నెముకగా ఉంటారు. తరచుగా వీరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పెంపుడు జంతువుల పెంపకందారులకు సంరక్షకులుగా, సలహాదారులుగా పని చేస్తారు. పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో, పెంపుడు జంతువులకు అత్యుత్తమ సంరక్షణ, పోషకాహారం అందేలా చేయడంలో పశువైద్య సమూహం కీలక పాత్ర పోషి స్తోంది. ఇలాంటి కార్యక్రమాలు జ్ఞాన-భాగస్వామ్యాన్ని పెంపొందించడమే కాకుండా వెటర్నరీ సైన్స్, పెంపుడు జంతువుల ఆహార ఆవిష్కరణల మధ్య వారధిని కూడా బలోపేతం చేస్తాయి. “కెనైన్ హీమోప్రొటోజోవాన్ వ్యాధులు – వాటి చికిత్స” అనే అంశంతో జరిగిన ఈ కార్యక్రమంలో నిపుణుల నేతృ త్వంలో వివిధ చర్చాగోష్ఠులు జరిగాయి. కార్నివెల్ తాజా ప్రీమియం లాంబ్ పెట్ ఫుడ్ శ్రేణిని కూడా ఈ సందర్భం గా ఆవిష్కరించారు. పశువైద్యులకు అత్యాధునిక పరిజ్ఞానం, పోషకాహార పరిష్కారాలను అందించడంలో కంపెనీ నిబద్ధతను ఈ కార్యక్రమం మరింతగా చాటిచెప్పింది.

ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత పశువైద్య నిపుణుడు, WSAVA మరియు FSAVA సభ్యుడు డాక్టర్. కె వినోద్ కుమార్ వివరణాత్మక ప్రెజెంటేషన్‌తో కూడిన నాలెడ్జ్ సెషన్‌లు జరిగాయియి. కుక్కల హీమోప్రొటోజోవా వ్యాధుల నిర్వ హణపై ఆచరణాత్మక చికిత్సలు, వాస్తవ-ప్రపంచ కేస్ స్టడీస్‌ను ఆయన వివరించారు. కార్నివెల్ సంస్థకు చెందిన పశువైద్యురాలైన డాక్టర్ రాణి, కంపెనీ యొక్క వినూత్న పెంపుడు జంతువుల ఆహార శ్రేణి వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్ర అంశాల గురించి వివరించారు. తాజా మాంసం, అంటార్కిటిక్ క్రిల్, పెంపుడు జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించిన సూపర్‌ఫుడ్ చేరికల యొక్క పోషక ప్రయోజనాలను చాటిచెప్పారు. ఈ ప్రత్యేక సందర్భంలోనే కార్నివెల్ తన ప్రీమియం లాంబ్ పెట్ ఫుడ్ వేరియంట్‌ను సగర్వంగా పరిచయం చేసింది. భారతదేశంలో ఇటువంటి అధిక-నాణ్యత ఉత్పత్తిని కిలో ₹513 ప్రారంభ ధరకు అందించే మొదటి బ్రాండ్‌ గా గుర్తించదగిన మైలురాయిని సాధించింది. పెంపుడు జంతువుల పోషణలో వినూత్నత, అందుబాటు కోసం కార్నివెల్ నిబద్ధతను ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తుంది. పెంపుడు జంతువుల యజమానులకు తమ ప్రియమైన సహచరులకు పోషకయుక్తమైన, ప్రత్యేకమైన ఎంపికను అందిస్తుంది.

కార్నివెల్ బిజినెస్ హెడ్ జెఎస్ రామ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలోని పశువైద్యులు చిన్న నగరాల్లో అధునాతన రోగనిర్ధారణ సాధనాలకు పరిమిత ప్రాప్యతనే పొందగలుగుతున్నారు. వాళ్లు విభిన్న పెంపుడు జంతువుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌తో సహా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచ డమే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ ఆవరణ వ్యవస్థలో అవసరమైన సమస్యల పరిష్కారానికి భాగస్వామ్య వేదికలను కూడా సృష్టిస్తాయి. ఈ కార్యక్రమం పశువైద్య నిపుణులను శక్తివంతం చేయడానికి, పెంపుడు జంతువుల పోషణలో వినూత్నతలను ఆవిష్కరించడానికి కార్నివెల్ ఆశ యాన్ని నొక్కి చెబుతుంది. వెట్ కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడానికి, ఉన్నతీకరించడానికి వీలుగా దేశవ్యాప్తంగా ఈ తరహాలో మరిన్ని నాలెడ్జ్ షేరింగ్ సెషన్‌లను నిర్వహించడానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు. పీపీఏటీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మురళీధర్‌తో సహా కీలకమైన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వెటర్నరీ సైన్స్‌ను అభివృద్ధి చేయడం, పశువైద్య కమ్యూనిటీతో బలమైన సంబంధాలను నిర్మించడంలో కార్నివెల్ అంకితభావాన్ని నొక్కి చెప్పింది.


గ్రోవెల్ గ్రూప్ గురించి:

గ్రోవెల్ గ్రూప్ ఆక్వాకల్చర్ ఫీడ్‌, ఫార్ములేషన్, సీఫుడ్ ప్రాసెసింగ్‌లో అగ్రగామిగా ఉంది. పరిశ్రమలో 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. వినూత్నత, నాణ్యత, జంతు సంక్షేమానికి కట్టుబడి, గ్రోవెల్ గ్రూప్ పెం పుడు జంతువులు, పశువులకు ప్రీమియం పోషకాహార పరిష్కారాలను అందింతచడానికి ప్రయత్నిస్తుంది. భారత దేశంలో 26 రాష్ట్రాలలో 173 జిల్లాల్లో విస్తరించి ఉన్న విస్తృత పంపిణీ నెట్‌వర్క్ మరియు 20 దేశాలకు ఎగుమతి చేయడంతో, గ్రోవెల్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కట్టుబడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Life und business coaching in wien – tobias judmaier, msc. Exciting news for cricket fans ! the lanka premier league 2023 (lpl 2023) is making a big leap by broadcasting its.