gamechanger song

మెగా అభిమానులకు పండగే పండగ

మెగా అభిమానులకు ఇక నుండి పండగే పండగ. డైరెక్టర్ శంకర్ (Shankar) – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram CHaran) కలయికలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో..మేకర్స్ ప్రమోషన్ పై దృష్టి సారించారు. ఇప్పటికే ఈ సినిమాలోని మూడు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..ఇక నుండి సినిమా తాలూకా వరుస అప్డేట్స్ రానున్నాయి. డిసెంబర్ రెండవ వారంలో నాలుగో సింగిల్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనవరి తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గా విడుదలైన నానా హైరానా సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కార్తీక్, శ్రేయ ఘోషల్ లు ఈ సాంగ్ ను పాడడం జరిగింది. రామజోగయ్యశాస్త్రి రచనలో నానా హైరానా అంటూ సాగింది. ఈ సాంగ్ ఒరిజినల్ లొకేషన్లలో ఉన్న అందాన్ని మెరుగుపరిచి చూపించడం దీని ప్రత్యేకత. విదేశాల్లో, సెట్స్ లో భారీ వ్యయంతో చిత్రీకరించిన ఈ పాట గేమ్ ఛేంజర్ ప్రత్యేక ఆకర్షణలో ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు.

ఇక ఇండస్ట్రీలో ముగ్గురు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. ఆ ముగ్గురు హీరోలు… రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్, పుష్ప తర్వాత నుంచే ఈ వార్ అనేది కొనసాగుతూ వస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి దేవర వచ్చింది. యావరేజ్ టాక్ అంటూనే 500 కోట్ల వరకు కలెక్షన్లు తెచ్చుకుంది ఈ మూవీ.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఇప్పటికే బిజినెస్‌తో 1000 కోట్లు సంపాదించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను క్రాస్ చేసేలా గేమ్ ఛేంజర్ ఉండాలని రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా అభిమానులు అనుకుంటున్నారు. అవన్నీ జరుగుతాయా లేదా అంటే… రాబోయే జనవరి 10వ తేదీ వరకు వెయిట్ చేయడం తప్పా.. చేసేదేమీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Innovative pi network lösungen. Hest blå tunge. The border would reopen to asylum seekers only when the number of crossings.