సీఎం రేవంత్ ఎమోష‌న‌ల్

మూసీ పునరుజ్జీవంపై సీఎం రేవంత్ ఎమోషనల్ అయ్యారు. హైద‌రాబాద్ కు మూసీ వ‌రం కావాలి కానీ శాపం కావ‌ద్దొని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న‌దుల వెంట నాగ‌రిక‌త వ‌ర్థిల్లాల‌ని, వాటిని క‌నుమ‌రుగ‌య్యేలా చేస్తే మ‌నిషి మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని, ప్ర‌జారోగ్యం, ప‌టిష్ఠ ఆర్థిక‌ ప‌ర్యావ‌ర‌ణ కోణాల్లో ప్ర‌పంచస్థాయి ప్ర‌మాణాల‌తో అభివృద్ది చెందాల్సిన హైద‌రాబాద్ కు మూసీ ఒక వ‌రం కావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మూసీని ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న‌దే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని , ఇది ఈ త‌రానికే కాదు, భావి త‌రాల‌కు సైతం మేలు చేసే నిర్ణ‌యం అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటె హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గోన్నారు. కోటి దీపోత్సవంలో దీప ప్రజ్వలన చేసిన రాష్ట్రపతి ముర్ము తొలి కార్తీక దీపాన్ని వెలిగించారు. పూరీ జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు సీఎం రేవంత్ ఘన స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

்?. ??. Am tag nach solingen : nein, vor der nürnberger lorenzkirche gab es keine is-demo ⁄ dirk bachhausen.