మూసీలో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం..
మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో కూల్చివేతలను మంగళవారం ఉదయం అధికారులు ప్రారంభించారు.RB- X అని రాసి, ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అవాంతరాలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. దాదాపు 140 ఇళ్లు ఖాళీ అయ్యాయి. ఇళ్లు ఖాళీ చేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నారు