మూసీ కూల్చివేతల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే – ఈటెల

తెలంగాణలో మూసీ కూల్చివేతల అంశంపై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తామని ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద పేదల తరఫున మహా ధర్నా నిర్వహించిన సందర్భంగా ఆయన స్పందించారు.

మూడు నెలలుగా కొనసాగుతున్న హైడ్రా మరియు మూసీ కూల్చివేతల కారణంగా పేద ప్రజలు కష్టాల పాలవుతున్నారని, రాష్ట్రం వ్యాప్తంగా వారి కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం అవుతోందని ఈటల చెప్పుకొచ్చారు. గతంలో ప్రభుత్వం హైదరాబాదుకు వలస వచ్చిన పేదల కోసం పట్టాలు అందజేసి, ఇళ్లను నిర్మించినప్పటికీ, నేడు అవి అక్రమ కట్టడాలుగా ఎలా పరిగణించబడుతున్నాయో ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన జరగాలన్న బీజేపీ కోరికకు విరుద్ధంగా, సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేతలు జరపబడుతున్నాయని, దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆయన విమర్శించారు. ఈ ప్రాంతంలోని ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నాయా, లేదా గతంలో అవి నీట మునిగాయా అనేదానికి ఆధారాలు చూపాలన్నారు. నిరూపణలేని పక్షంలో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఈటల సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

??. I done for you youtube system earns us commissions. New 2025 forest river wildwood 42veranda for sale in monticello mn 55362 at monticello mn ww25 012 open road rv.