Anil Kumble: మూడవ స్థానంలో కోహ్లీ వైఫల్యం వేళ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు

Anil Kumble

బెంగళూరులోని ఎం చినాస్‌వామి స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకు ఆలౌట్ కావడం భారత అభిమానులకు నిజంగా చేదు అనుభవమైంది సొంతగడ్డపై భారత్‌కు ఇది అత్యల్ప టెస్ట్ స్కోరు కావడం గమనార్హం. కివీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తూ భారత బ్యాటింగ్ లైనప్‌ను కుదిపేసారు యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ బ్యాటర్లు కూడా నిలకడగా ఆడలేకపోయారు ఈ దారుణంగా ప్రారంభమైన ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీతో సహా ఇతర ముఖ్య బ్యాటర్లు కూడా విఫలమయ్యారు ప్రత్యేకంగా మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ 9 బంతులు ఆడినా ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔటయ్యాడు. ఇది మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడి పాత్రపై పెద్ద చర్చకు దారితీసింది.

కుంబ్లే అభిప్రాయంతో పుజారా మూడవ స్థానానికి సరైన ఆటగాడు అని స్పష్టం చేశారు అతడు కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కొని ఒత్తిడిని జట్టుపై తగ్గించగలడని కుంబ్లే వ్యాఖ్యానించారు అతడు ప్రతి బంతిని ఆడడానికి ప్రయత్నించేవాడు కాదని క్రమపద్దతిలో ఆడేవాడని కుంబ్లే గుర్తుచేశారు కోహ్లీకి మాత్రం నాలుగో స్థానంలో ఆడే అవకాశాన్ని ఇవ్వాల్సిందని కుంబ్లే అభిప్రాయపడ్డారు నాలుగో స్థానంలో కోహ్లీ తిరుగులేని బ్యాటర్ అని స్పష్టంగా పేర్కొన్నారు భారత బ్యాటర్ల బ్యాటింగ్ విధానం కూడా కుంబ్లే దృష్టిని ఆకర్షించింది ప్రతి బంతిని ఆడటానికి ప్రయత్నించడం వారి పొరపాటు అని విమర్శించారు ఒక బ్యాటర్ కొన్ని బంతులను రానివ్వాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించరాదని క్రమశిక్షణతో ఆడాల్సిన అవసరం ఉందని కుంబ్లే సూచించారు పుజారా వంటి స్థిరమైన ఆటగాడిని జట్టు కోల్పోయినందుకు భారత బ్యాటింగ్ పటిష్టత తగ్గిపోయిందని కుంబ్లే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో భారత జట్టు మున్ముందు స్ట్రాటజీకి మార్పులు తీసుకురావాలని బ్యాటింగ్ లైనప్‌లో సమతుల్యత అవసరమని కుంబ్లే అభిప్రాయపడ్డారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    ??. Free buyer traffic app. 2025 forest river wildwood 42veranda.