ఆ ఒక్క కోరిక తీరకుండానే చనిపోయిన రతన్ టాటా

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. అయితే టాటా కు ఒక కోరిక ఉండేదట..ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారని అంత మాట్లాడుకుంటున్నారు.

టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిరిండియాను మళ్లీ టాటాల పట్టులోకి తీసుకురావాలన్నది రతన్ టాటా చిరకాల కోరిక. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్ లైన్స్, మలేషియా ఎయిర్ లైన్స్ తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే, ఈ సంస్థ నష్టాల్లో ఉందని.. భారత ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థా ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ ఆధీనంలోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. అయితే, ఇప్పుడే నష్టాల నుంచి ఒడ్డున పడుతూ.. లాభాల దిశగా అడుగులు వేస్తున్న ఎయిర్ ఇండియా పూర్తి లాభాలు చూడకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. దీన్ని లాభాల బాటలో పెట్టాలని.. సామాన్యులు కూడా తక్కువ ఖర్చుతో విమానం ఎక్కాలన్నది ఆయన కోరికగా ఉండేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

精选. ==> click here to get started with auto viral ai. Discover the 2025 forest river rockwood mini lite 2509s : where every journey becomes an unforgettable experience !.