కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు హర్యానా ప్రజలు..జమ్మూ & హర్యానా లో కాంగ్రెస్ విజయం కహాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉదయమే సంబరాలు మొదలుపెట్టారు. కానీ హర్యానా లో మాత్రం ఓటర్లు షాక్ ఇచ్చారు. అక్కడ మరోసారి బిజెపికి పట్టం కట్టారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఎన్సీ 41 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుంధుబి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జమ్ముకశ్మీర్ ఫలితాలు వెలువడ్డాయి.
హరియాణాలో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యంలోకి వచ్చినా కాంగ్రెస్ తర్వాత వెనుబడి రెండో స్థానానికే పరిమితమైంది.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో కాంగ్రెస్ 50 నుంచి 60 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 20-30 మధ్యలో సీట్లు వస్తాయని తెలిపాయి. ఇక ఈ ఎన్నిక్లలో బీజేపీ హ్యాట్రిక్కు బ్రేక్ పడుతుందని అని అంతా అనుకున్నారు. కానీ ఫలితాల ట్రెండ్ మొత్తం మారిపోయింది. ఇక ఎన్నికల్లో ఎప్పడూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శనించకూడదని, హరియాణా ఎలక్షన్స్ ద్వారా గుణపాఠం నేర్చుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఏ ఎన్నికనూ తేలికగా తీసుకోకూడదన్న కేజ్రీవాల్, ప్రతి సీటు చాలా కఠినమైనదని చెప్పారు. ఆప్ మున్సిపల్ కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.