హైదరాబాద్(Hyderabad)కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్(Cyber) నేరగాళ్లకు బలయ్యాడు. హనీ ట్రాప్(Honeytrap) ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు రూ. 38.73 లక్షలు కాజేశారు. ఈ ఘటన మొదట ఫేస్‌బుక్(Facebook)లో మొదలైంది. వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్‌గా జీవనం సాగిస్తున్నదని పరిచయం చేసుకుంది. తన జీవిత కథను తేలికగా చెప్పి మానవత్వాన్ని రేకెత్తించిన ఆమె, వృద్ధుడితో చాటింగ్ చేయాలంటే ఇంటర్నెట్ సదుపాయం అవసరమని చెప్పారు. ఇందుకోసం ఆమె ఓ కేబుల్ ఆపరేటర్ నంబర్‌ను ఇచ్చింది.

కేబుల్ ఆపరేటర్‌తోనే చాటింగ్ ..
వృద్ధుడు మహిళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమె సూచించిన కేబుల్ ఆపరేటర్(Canle Operator)కి సంప్రదించి రూ. 10,000 చెల్లించాడు. అయితే, ఈ చెల్లింపు అనంతరం ఆ మహిళ నుంచి ఫేస్‌బుక్‌లో స్పందన లేకపోవడంతో.. వృద్ధుడు అదే కేబుల్ ఆపరేటర్‌తోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే మోసం మొదలైపోయిందన్న విషయం అతను గ్రహించలేకపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు. ఆ సమాచారం విని వృద్ధుడు చలించిపోయి, వెంటనే మరో రూ. 10 లక్షలు అతనికి పంపించాడు. ఈ సహాయం అనంతరం కూడా మోసం ఆగలేదు. మళ్లీ వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి మరో రూ. 2.65 లక్షలు వసూలు చేశారు.
ఈ క్రమంలో మొత్తం మొత్తం 38.73 లక్షలు వృద్ధుడు కోల్పోయాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు చివరికి నిజమైన పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది.
Read Also: Murder: నాన్నని చంపింది వాళ్ళే..సాక్ష్యం చెప్పిన కుమారుడు!