Myanmar Earthquake: మయన్మార్‌ లో 694 మంది మృతి భారత్ భారీ సాయం

Myanmar Earthquake: మయన్మార్‌ లో 694 మంది మృతి భారత్ భారీ సాయం

మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తాజా ప్రకటనలో వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైమ్‌లో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

రిక్టర్ స్కేల్‌

ఓవైపు శిథిలాల కింద శవాలు, మరోవైపు కాపాడండి అనే ఆర్తనాదాలతో మయన్మార్, థాయ్‌లాండ్ భూకంప బీభత్సంతో విలవిల్లాడుతున్నాయి.మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాలను వరుస భూకంపాలు అతలాకుతలం చేశాయి. 7.7 మ్యాగ్నిట్యూడ్‌ తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల భారీ భవనాలు కూలిపోవడంతో అన్ని చోట్ల శిథిలాలు, శవాలే కనిపిస్తున్నాయి.

భూకంపం ప్రభావం

భూకంపం కారణంగా 694 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్‌ వంతెన, ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

థాయ్‌లాండ్‌లోనూ భూకంపం

భూకంప ప్రభావం థాయ్‌లాండ్‌లోనూ తీవ్రంగా ఉంది. కొన్ని నగరాల్లో భవనాలు బీటలవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.భారత ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యేక బృందాలను సహాయక చర్యలకు పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. మయన్మార్‌, థాయ్‌లాండ్ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని స్పష్టం చేసింది.

భారత్‌ సహాయం

భూకంప బీభత్సంతో మయన్మార్ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సహాయక చర్యలకు ముందుకొచ్చింది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, ఏ ఎఫ్ ఎస్ హిండన్ నుంచి ఐ ఏఎఫ్ సి 130 జె విమానం సహాయక సామగ్రితో బయలుదేరింది. ఈ సహాయ సామగ్రిలోటెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు,తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం,వాటర్ ప్యూరిఫైయర్స్, హైజీన్ కిట్లు,సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు,తదితర అత్యవసర వస్తువులు ఉన్నాయి. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగించేందుకు భారత్ తక్షణ చర్యలు చేపట్టింది.

Related Posts
వైఎస్‌ఆర్‌సీపీ-టీడీపీ మధ్య ఉద్రికత్తలు..మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం
Tensions between YSRCP TDP.Former minister Appalaraju under house arrest

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ-పలాసలో వైస్‌ఆర్‌సీపీ మరియు టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు Read more

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకి సీసీటీవీల నిఘా
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకి సీసీటీవీల నిఘా

తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిజి బిఐఈ) వృత్తి కోర్సులు మరియు సాధారణ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుండి 22 మధ్య నిర్వహించేందుకు Read more

భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం? మాజీ సీజేఐ
dychandrachud

భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఆరోపణలపై మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ స్పందించారు. ఈ మేరకు ఆ ఆరోపణలు ఖండించారు. చట్టప్రకారమే తీర్పులు వెలువరించినట్లు చెప్పారు. Read more

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ 2025
CEEW brings eco friendly cartoons to Hyderabad Literature Festival 2025

హైదరాబాద్ : కౌన్సిల్ ఆన్ ఎనర్జీ , ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) యొక్క ప్రతిష్టాత్మక కార్టూన్ సిరీస్ అయిన వాట్ ఆన్ ఎర్త్!® (WOE), హైదరాబాద్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *