Headlines
Over 100 flights delayed due to heavy fog

కమ్మేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం

న్యూఢిల్లీ: చలి తీవ్రతకు ఉత్తరభారతం వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా యూపీ, పంజాబ్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఆయా ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విజిబిలిటీ జీరోకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

image
image

దృశ్యమానత పడిపోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వందకుపైగా విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాలు రద్దు కాగా, మరికొన్ని క్యాన్సల్‌ అయ్యాయి. ఇక కోల్‌కతా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 12 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిర్ ట్రాఫిక్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లైట్‌రాడార్ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Best new artificial intelligence search engine. Diamond mailer clear cut e mailer solutions. Warehouse.